కన్నతల్లి, జన్మభూమి, మాతృభాష - ఈ మూడిటి కన్న మిన్నయైనది, గౌరవప్రదమైనది, ఆరాధనీయమైనది మరోటి లేదు. వీటిలో, మాతృభాషను తెలుగువారు ఉపేక్షిస్తున్నారు. మనభాషను మనమే చులకన చేస్తే మనమే పలుచన అవుతాం. తెలుగు జాతిని, తెలుగు భాషను, తెలుగు దేశాన్ని కాపాడుకోవాలని చెప్తూ కాకతీయుల సమకాలికుడైన నన్నెచోడ మహాకవి తెలుగు నిలుపుట అనే మాట చెప్పాడని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, తేరాల సత్యనారాయణ శర్మ రాసాడు. ఆనాడు భాషను కాపాడుకోవలసి వచ్చింది - పర దేశస్థుల దండయాత్రల నుండి, వారి సాంస్కృతిక దురాక్రమణల నుండి. ఇప్పుడు మాత్రం.. మనకు మనమే శత్రువులం. ఎంత విషాదం!
|