స్వాతి వారపత్రిక
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
స్వాతి సపరివార పత్రిక తెలుగు పత్రికా ప్రపంచంలో ఒక నూతన విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇది 1975 సంవత్సరం ప్రారంభమైనది. దీని సంపాదకులు వేమూరి బలరామ్. వీరు ఒక విధంగా యువతనూ, గృహిణులనూ, పాత తరాల వారిని ఆకట్టుకొనే రచనలను ప్రచురిస్తూ అత్యధిక సర్క్యులేషన్ కలిగిన వారపత్రికగా స్వాతిని తీర్చిదిద్దారు. డా.జి.సమరం రాసిన సెక్స్ విజ్ఞానం శీర్షిక చాలా ఆకర్షించింది. "సర్వసంభవామ్" శీర్షికను సీనియర్ ఐ.ఎ.ఎస్. అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ తాను తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నప్పుడు కలిగిన అనుభవాలను తెలియజేస్తూ రాశారు. ఆ తరువాత "నాహం కర్తా, హరిః కర్తా" అనే పుస్తకంగా వెలువరించారు.