See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
సంధి - వికీపీడియా

సంధి

వికీపీడియా నుండి

సంధి అనగా రెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును. ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది. రాముడు + అతడు = రాముడతడు అయినది.

విషయ సూచిక

[మార్చు] సంస్కృత సంధులు

  • సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.

ఉదా: భాను+ఉదయము=భానూదయము. భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది

  • గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.

ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము.

  • యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగును

ఉదా: అతి+అంతము=అత్యంతము.

  • వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔ లు పరమగునపుడు ఔ కారమును వచ్చును

ఉదా: ఏక+ఏక=ఏకైక.

  • అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.

ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.

  • జస్త్వ సంధి: వర్గ ప్రధమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.

ఉదా: వాక్+ఈశ=వాగీశ.

  • శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.

ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.

  • ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.

ఉదా: తత్+టీక=తట్టీక.

  • ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.

[మార్చు] తెలుగు సంధులు

ఇవి అచ్చులకును, హల్లులకును చెందియున్నవి.

[మార్చు] అచ్చు సంధులు :

  • అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు.

ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు.

  • యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.

ఉదా: వెల+ఆలు=వెలయాలు.

  • ఇకార సంధి: ఇత్తునకు సంధి వైకల్పికముగానగు.

ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు

  • ఉకార సంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు

ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి.

  • ఆమ్రేడిత సంధి: అచ్చునకామ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.

ఉదా: ఏమి+ఏమి=ఏమేమి.

[మార్చు] హల్లు సంధులు :

  • గసడదవాదేశ సంధి: ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.

ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె

  • సరళాదేశ సంధి: ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు

ఉదా: పూచెను+కలువలు=పూచెనుగలువలు

  • పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణకంబునకు పుం-పు లగు

ఉదా: సరసము+మాట=సరసపుమాట

  • ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.

ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు

  • టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.

ఉదా: పేరు+ఉరము=పేరుటురము

  • రుగాగమ సంధి: పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు

ఉదా: పేద+ఆలు=పేదరాలు

  • దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.

ఉదా: నీ+చెలిమి=నీదు చెలిమి

  • నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.

ఉదా: సొగసు+తనము=సొగసుందనము

  • పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె

  • త్రిక సంధి: ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.

ఉదా: ఆ+క్కడ=అక్కడ.

  • ద్విగు సమాస సంధి: సమానాధికరణంబగు ఉత్తర పదంబు పరంబగునపుడు 'మూడు' శబ్దములోని 'డు' వర్ణమునకు లోపంబును, మీది హల్లునకు ద్విత్వంబునగు.

ఉదా: మూడు+లోకములు=ముల్లోకములు.

  • బహువ్రీహి సమాస సంధి: బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు బోడియగు.

ఉదా: అలరు+మేను=అలరుఁ బోడి.

  • ప్రాతాది సంధి: సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.

ఉదా: క్రొత్త+గండి=క్రొగ్గండి.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -