షోయబ్ అక్తర్
వికీపీడియా నుండి
1975, ఆగష్టు 13న పంజాబ్ (పాకిస్తాన్) లోని రావల్పిండిలో జన్మించిన షోయబ్ అక్తర్ (Shoaib Akhtar) పాకిస్తాన్ కు చెందిన క్రికెట్ క్రీడాకారుడు. అతివేగంగా బౌలింగ్ విసరడంలో ఇతడు ప్రసిద్ధి చెందినాడు. తరుచుగా వివాదాలలో కూరుకొని పలుమార్లు జట్టు నుంచి తొలిగించబడ్డాడు. 2005లో ఆస్ట్రేలియా పర్యటన నుంచి అర్థాంతరంగా పంపివేయబడ్డాడు. ఆ మరుసటి సంవత్సరంలో డ్రగ్ వివాదంలో కూరుకొని నిషేధించబడ్డాడు. 2007 సెప్టెంబర్ లో సహచర ఆటగాడు మహ్మద్ ఆసిఫ్‌తో గొడవపడి జట్టు నుంచి వెలి వేయబడ్డాడు.[1]ఇటీవల 2008, ఏప్రిల్ 1న ఆటగాళ్ళ ప్రవర్తనా నియమావళిని ఉల్లఘించింనందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుచే 5 సంవత్సరాల నిషేధానికి గురైనాడు.[2]
[మార్చు] టెస్ట్, వన్డే గణాంకాలు
షోయబ్ 46 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 25.69 సగటుతో 178 వికెట్లను సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 11 పరుగులకు 6 వికెట్లు. వన్డేలలో 138 మ్యాచ్‌లు ఆడి 23.20 సగటుతో 219 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 16 పరుగులకు 6 వికెట్లు.
అక్తర్ 3 ప్రపంచ కప్ పోటీలలో కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2007 ప్రపంచ కప్ పోటీలలో జట్టులో మొదట చేరిననూ గాయం వల్ల పోటీలలో పాల్గొనలేడు.