విశ్వకర్మ
వికీపీడియా నుండి
విశ్వకర్మ దేవతలకు శిల్పి. బ్రహ్మ ఆదేశం మేరకు విశ్వాన్ని సృష్టించింది విశ్వకర్మ.
[మార్చు] విశ్వకర్మ పూజ
విశ్వకర్మ పూజ ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న జరుపుకుంటారు. ఇవి ముఖ్యంగా కర్మాగారాలు మరియు పారిశ్రామిక ప్రాంతాలలో తప్పకుండా జరుపుతారు. వారి పనిముట్లను విశ్వకర్మ ముందుంచి పూజిస్తారు.
[మార్చు] విశ్వకర్మ నిర్మాణాలు
విశ్వకర్మ హిందూ పురాణాల ప్రకారం ఎన్నో పట్టణాలను నాలుగు యుగాలలో నిర్మించాడు. సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం నిర్మించాడు. త్రేతాయుగంలో సువర్ణ లంకను శివుని కోసం నిర్మించాడు. ద్వాపర యుగంలో ద్వారక నగరాన్ని మరియు కలియుగంలో హస్తినాపురం మరియు ఇంద్రప్రస్థం నిర్మించాడు.