వాంతి
వికీపీడియా నుండి
బలవంతంగా జీర్ణకోశంలోని పదార్ధాలు నోరు, అరుదుగా ముక్కు ద్వారా బయటకు రావడాన్ని 'వాంతి' (Vomiting) అంటారు. ఇది ఒక వ్యాధి లక్షణము.
వాంతులు వివిధ కారణాల వలన కలుగుతాయి. జీర్ణాశయంలోని కారణాలు, తల నొప్పి వంటి కొన్ని మెదడుకు సంబంధించిన బయటి కారణాలు. వాంతి అవుతుందేమో నన్న భయాన్ని వికారం అంటారు. ఎక్కువగా వాంతులవుతున్నప్పుడు వీటిని ఆపడానికి వైద్యం అవసరం. తీవ్రమైన పరిస్థితులలో ద్రవాలను నరం ద్వారా ఎక్కించవలసి వస్తుంది.
విషయ సూచిక |
[మార్చు] కారణాలు
[మార్చు] జీర్ణ వ్యవస్థ
- జీర్ణాశయం వాపు (ఆహార సంబంధమైనవి, వైరస్)
- పైలోరిక్ స్టెనోసిస్ (చిన్న పిల్లలలో ఎక్కువగా కనబడుతుంది)
- ప్రేగులో అడ్డంకి
- విపరీతమైన కడుపు నొప్పి
- పిత్తాశయము, క్లోమము, ఉండుకము, కాలేయము వాటికి సంబంధించిన వాపులు
- ఆహర సంబంధిత అలర్జీ (పిల్లలకు పట్టే పాలలోని లాక్టోజ్ పడకపోవడం)
[మార్చు] మెదడు మరియు జ్ఞానేంద్రియాలు
- ఎక్కువగా కదలిక వలన లోపలి చెవిలోని జ్ఞానేంద్రియాల మూలంగా
- తలకు దెబ్బ తగలడం
- మెదడులో రక్తస్రావం
- మైగ్రేన్ అనే ప్రత్యేకమైన తలనొప్పి
- మెదడులో ట్యూమర్లు
- మెదడులోని పీడనం ఎక్కువగా ఉండటం.
[మార్చు] జీవ క్రియలు
- రక్తంలో కాల్షియమ్ ఎక్కువ కావడం
- యురీమియా (రక్తంలో యూరియా ఎక్కువ కావడం, మూత్రపిండాల వైఫల్యం కారణంగా
- అధివృక్క గ్రంధి వైఫల్యం
- రక్తంలో గ్లూకోజ్ తక్కువ కావడం
[మార్చు] గర్భానికి చెందినవి
- ముత్యాల గర్భం
- Hyperemesis, Morning sickness
[మార్చు] మందులు, ఇతర పానీయాలు
- ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం
- ఓపియమ్ తీసుకోవడం
- కాన్సర్ వైద్యంలో వాడుతున్న మందులుdrugs
[మార్చు] మానసినమైనవి
- మానసిక కారణాల మూలంగా వారంతట వారే వాంతి చేసుకోవడం
- అసహ్యమైన వాటిని చూచినా, వాసన చూసినా, ఆలోచించినా కొందరిలో వాంతవుతుంది.
- ఎక్కువ మోతాదులో రేడియేషన్
- ఫిట్స్ మొదలైన తీవ్రమైన క్రియలు
- అతిగా భయం