వంగర వెంకట సుబ్బయ్య
వికీపీడియా నుండి
తెలుగు సినిమా మరియు నాటక రంగాలలో వంగర గా ప్రసిద్ధులైన హాస్యనటులు వంగర వెంకట సుబ్బయ్య (Vangara Venkata Subbaiah). వీరు ఒంగోలు తాలూకాలో 1897, నవంబరు 24న జన్మించారు.
తెనాలిలో స్థిరనివాసం ఏర్పరచుకుని స్తానం వారితొ చేరి 'శ్రీకృష్ణ తులభారం' నాటకంలో వసంతకుడు వేషం వేసి కళాహృదయుల మన్ననలందుకున్నారు. వీరు ఇంకా 'విప్రనారాయణ', 'సక్కుబాయి' మొదలగు నాటకాలలో హాస్య భూమికలను పోషించారు. 1937లో విప్రనారాయణ చిత్రంలో శిష్యుడుగా వేషంవేసి, ఆంధ్ర సినిమా ప్రేక్షకుల మీద సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. తరువాత బాలయోగిని చిత్రంలో ప్రధాన భూమికను పోషించారు. వీరు ఇంచుమించు వందకు పైగా తెలుగు చిత్రాలలో నటించారు. వీటిలో పెద్దమనుషులు, కన్యాశుల్కం, లక్ష్మమ్మ, ప్రియురాలు, లక్ష్మి, చక్రపాణి, పల్నాటి యుద్ధం, తెనాలి రామకృష్ణ, శ్రీకృష్ణ తులాభారం, గీతాంజలి, మంత్రదండం, పేరంటాలు, శాంతి, సక్కుబాయి ముఖ్యమైనవి.
[మార్చు] చిత్రసమాహారం
- Paramanandayya Shishyula Katha (1966)
- Babruvahana (1964)
- Narthanasala (1963)
- Tirupathamma Katha (1963)
- Bhishma (1962)
- Mahakavi Kalidasu (1960/I)
- Sri Venkateswara Mahatmyam (1960)
- Chenchu Lakshmi (1958/I)
- Mangalya Balam (1958)
- Maya Bazaar (1957/I) .... Sastri
- Panduranga Mahatyam (1957)
- Tenali Ramakrishna (1956/I)
- Edi Nijam (1956) .... Poojari
- Kanyasulkam (1955) .... Karataka Sastri
- Peddamanushulu (1954)
- Dharmadevata (1952/I) .... Duvva
- Malliswari (1951)
- Shavukaru (1950)
- Mana Desam (1949)
- Raksharekha (1949)
- Palnati Yudham (1947) .... Subbanna
- Raitu Bidda (1939)
- Malapilla (1938)
- Balayogini (1936/I)
[మార్చు] మూలాలు
- 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు, 2005.