లింగాల (మందవల్లి)
వికీపీడియా నుండి
లింగాల కృష్ణా జిల్లా, మండవల్లి మండలానికి చెందిన గ్రామము.ఈ గ్రామము ఏలూరు పార్లమెంటు నియోజకవర్గము, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గము నకు చెందినది. ఈ గ్రామ ప్రాశస్త్యము , అక్కడి "దేవీతల్లి" అమ్మవారి దసరా ఉత్సవములు. సుమారు 65 సంవత్సరముల నుండి ఈ ఊరి లో దసరా నవరాత్రులు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఊరి లోని వైశ్యులు మరియు కాపులు నాయకత్వము వహించి, నిర్వహించు ఈ ఉత్సవములు వీక్షించుటకు చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు వచ్చెదరు.ఇందులో ముఖ్య ఆకర్షణ హరికథ,బుర్రకథ, కోలాటము వంటి సాంసృతిక కార్యక్రమాలు. ఈ ఊరిలో కృష్ణ జయంతి ఉత్సవములు యాదవులు జరుపుతారు.
పూర్తిగా వ్యవసాయము పై ఆధారపడిన ఈ ఊరి ప్రజల ముఖ్య ఎగుమతి వరి. కృష్ణా నది పై విజయవాడ వద్ద గల ప్రకాశం వంతెన నుండి ప్రారంభమైన ఎడమ కాలువ ఈ ఊరి రైతులకు అన్నపూర్ణ గా వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది.చేపలు ఇక్కడి నుంచి కలకత్తా వంటి నగరాలకు ఎగుమతి అవుతాయి.
ఈ గ్రామములో చాలా ప్రదేశములలో ఆయిల్ దొరుకుతుంది. దీనిని ఆధారము చేసుకోని చాలా వ్యవస్థలు నడుపుతున్నారు.
ముఖ్య కులములు: కాపు (Kapu), గవనులు (Gowda), యాదవులు(yadavulu).
ఈ ఊరి లో ఒక పోస్టాఫీసు,ప్రభుత్వ ప్రాధమిక మరియు ఉన్నత పాఠశాల కలవు. విజయవాడ - భీమవరము రాష్ట్ర రహదారి ముఖ్య రవాణా మార్గము. రైలు మార్గము ద్వారా కైకలూరు చేరి అటుపై రోడ్డు ద్వారా ఈ ఊరు చేరవచ్చు. మొఖాసాకలవపూడి లేదా పుట్లచెరువు రైల్వే స్టేషన్లలో దిగినా దగ్గరగానే ఉంటుంది.
|
|
---|---|
అప్పాపురం · అయ్యవారిరుద్రవరం · భైరవపట్నం · చావలిపాడు · చింతలపూడి · దయ్యంపాడు · గన్నవరం · ఇంగిలిపాకలంక · కానుకొల్లు · కొవ్వాడలంక · లేళ్ళపూడి · లింగాల · మండవల్లి · మనుగునూరు · మొఖాసాకలవపూడి · మూడుతల్లపాడు · నందిగామలంక · నుత్చుముల్లి · పసలపూడి · పెనుమాకలంక · పిల్లిపాడు · ప్రత్తిపాడు · పులపర్రు · పుట్లచెరువు · సింగనపూడి · శోభనాద్రిపురం · తక్కెలపాడు · ఉనికిలి · సుబ్బారావు పేట · పెరికెగూడెం |