మూగ మనసులు (1964 సినిమా)
వికీపీడియా నుండి
మూగ మనసులు (1964) | |
దర్శకత్వం | ఆదుర్తి సుబ్బారావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , సావిత్రి , జమున |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | బాబూ మూవీస్ |
భాష | తెలుగు |
[మార్చు] సంక్షిప్త చిత్రకథ
ఇదొక అరుదైన, అపురూపమైన ప్రేమకథ. దీనికి ప్రేరణ పూర్వజన్మ పరిజ్ఞానం. చావు-పుట్టుక అనేవి శరీరానికే కానీ, ఆత్మకు కావనీ చిత్ర ప్రారంభంలో నేపథ్యంలో చెప్పిస్తారు. కొత్త దంపతులు గోపీనాథ్, రాధ హనీమూన్ కోసం బయలుదేరడంతో కథ ప్రారంభమై, గోదావరిలో పడవ ప్రయాణిస్తుండగా - కొద్ది దూరంలో ప్రాణాంతకమైన సుడిగుండాలు ఉన్నాయంటూ పడవను ఆపమని విలపిస్తాడు గోపీనాథ్, నాయిక రాధ కూడా కోరడంతో పడవను ఆపుతాడు సరంగు.
గోపీనాథ్ అన్యమనస్కంగా అల్లంతదూరాన ఉన్న పాడుపడ్డ మేడ వద్దకు వెళ్ళి, గతజన్మ స్మృతులు గుర్తుకు రాగా, అక్కడ ఒక ముసలివాడు తారసిల్లి అది జమిందారు భవంతి అని చెప్పి, అమ్మాయిగారు రాధ, గోపీల సమాధుల దగ్గరకు తీసుకు వెళతాడు. అక్కడ ఆ సమాధులకు దీపం పెడుతూ చావు కోసం నిరీక్షిస్తున్న వృద్ధురాలు గౌరిని చూసి
[మార్చు] పాటలు
పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఈనాటి ఈ బంధమేనాటిదో | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
గోదారి గట్టుంది గట్టు మీద సెట్టుంది సెట్టుకొమ్మన పిట్టుంది పిట్టమనసులో ఏముంది | దాశరథి | కె.వి.మహదేవన్ | పి.సుశీల |
ముద్దబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలుసులే | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
పాడుతా తీయగా చల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల |
నా పాట నీ నోట పలకాల సిలకా నీ బుగ్గలో సిగ్గు లొలకాల సిలకా | ఆత్రేయ | కె.వి.మహదేవన్ | ఘంటసాల పి.సుశీల |
గౌరమ్మా నీ మొగుడెవరమ్మా | |||
మానూ మకును కాను రాయీ రప్పను కానేకాను | |||
ముక్కుమీద కోపం నీ ముఖానికీ అందం |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు సంకలనం చేసిన ఘంటసాల 'పాట'శాల, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006