పి.సుశీల
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
పి.సుశీల | |
బొమ్మ:PSuseela01.jpg |
|
జననం | నవంబర్ 13,1935[1] విజయనగరం, ఆంధ్రప్రదేశ్ |
---|---|
ప్రాముఖ్యత | సినీ గాయని |
భార్య/భర్త | బి.రాజా రామ్మోహనరావు |
సంతానం | 1 కుమారుడు (జయకృష్ణ) |
వెబ్‌సైటు | http://psusheela.com/ |
పి.సుశీల (పానులేటి సుశీల) ప్రముఖ గాయకురాలు. 50 సంవత్సరాల సినీ జీవితములో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో 25 వేలకు పైగా గీతాలు పాడింది.
సుశీల 1935లో విజయనగరంలో సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించింది. ఈమె తండ్రి పి.ముకుందరావు ప్రముఖ క్రిమినల్ లాయరు. తల్లి శేషావతారం. 1950లో సంగీత దర్శకుడు నాగేశ్వరరావు ఆలిండియా రేడియోలో నిర్వహించిన పోటీలో సుశీలను ఎన్నుకున్నారు. ఆమె ఏ.ఎమ్.రాజాతో కలిసి పెట్ర తాయ్ (తెలుగులో కన్నతల్లి) అనే సినిమాలో ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది.
[మార్చు] పురస్కారములు
- భారత జాతీయ పురస్కారాలలో ఉత్తమ గాయనిగా ఐదు సార్లు (1969 - ఉయిర్ మనిదన్, 1972 - సావలే సమాలి, 1978 - సిరిసిరి మువ్వ, 1983 -మేఘ సందేశం మరియు 1984- ఎం.ఎల్.ఏ.ఏడుకొండలు) ఎన్నుకోబడింది.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే రఘుపతి వెంకయ్య పురస్కారం 2001 లో
- స్వరాలయ ఏసుదాస్ పురస్కారం 2005 లో
- 2008 జనవరి 25 న భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డ్ తో గాన కోకిల పి.సుశీల గారిని సత్కరించింది.
[మార్చు] మూలాలు
[మార్చు] బయటి లింకులు
- సుశీల వెబ్‌సైటు
- తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం వెబ్సైటులో సుశీల గురించి 2007 - పద్మ భూషన్ పురస్కార గ్రహీతలు