See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
మథుర - వికీపీడియా

మథుర

వికీపీడియా నుండి

మథుర భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న హింధూ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఇది దాదాపు ఆగ్రాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ కి 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణంలో ఉంది. ఇది మథుర జిల్లాకు ముఖ్యపట్టణం. ప్రాచీనకాలంలో ఇది ఒక ప్రముఖ వ్యాపార కేంద్రం. పాత కాలంలోఒంటెల మీద జరిగే వస్తురవాణా మార్గాలలో ఇది ప్రముఖ కేంద్రం. ఈ నగరంలో శ్రీ కృష్ణుడు జన్మించాడు కనుక ఇది శ్రీకృష్ణ జన్మభూమి గా ఖ్యాతి గాంచింది. భూగర్భ చెరసాలలో జన్మించిన శ్రీ కృష్ణుని జన్మస్థలంలో ప్రాచీనకాలంలో కేశవ్‌దేవ్ ఆలయం నిర్మించ బడింది. శ్రీకృష్ణిని మేనమామచే పాలించబడుతున్న సూరసేన సామ్రాజ్యానికి మథుర రాజధాని.
మథుర బుద్ధ విగ్రహాలు తయారయ్యే ప్రాచీన రెండు నగరాలలో ఒకటి. రెండవ నగరం ప్రస్థుతం ఆఫ్గనిస్థాన్ లో ఉన్న గాంధారం. రెండు నగరాలలో ఒకటిగానే క్రీ.శ మొదటి శతాబ్ధం లో బుద్ధిని శిలలు చెక్కడం ఆరంభించినట్లు అంచనా. గాంధారంతయారైన శిలలు ఇండో గ్రీకు సిల్ప శైలిలోనూ మధురలో తయారైన సిలలు హిందూ దేవతల శిల్ప శైలిలోనూ ఉన్నాయి.
షెర్లాక్ హోమ్స్ రచించిన 'ది సైన్ ఆఫ్ ఫోర్' నవలలో మథురా నగర వర్ణన ఉంది.

విషయ సూచిక

[మార్చు] చరిత్ర

మథురకు పురాణ కాలంనుండి చరిత్ర ఉంది. మథురా నగరం రామాయణ మహాకావ్యం లో వర్ణించబడింది. ఇక్ష్వాకు రాజకుమారుడూ దశరధ చక్రవర్తి కుమారుడూ రామాయణ మహాకావ్య నాయకుడు శ్రీరామచంద్రుని తమ్ముడైన శత్రుఘ్నుడు ఇక్కడ లవణాసురుని సంహరించినట్లు పురాణ కధనం. తరవాత ఆ దట్టమైన అరణ్యప్రదేశం మధువనంగానూ మథుపురంగానూ మథురగానూ నామాంతరం చెందినట్లు పురాణ కథనం. నిశిత పరిశోధనలు లవణాసురుడు శివభక్తుడూ శివునినుండి త్రిసూలాన్ని వరంగా పొందిన మధువు సంతతివాడనీ ఆకారణంగా ఈ నగరానికి మథుర అనే పేరు వచ్చినట్లు చెప్తున్నాయి. యాదవరాజైన మథు పేరుమీద ఈ నగరానికి ఈ పేరు వచ్చినట్లూ పురాణాల కథనం. ఇలా ఈ నగర పేరుకి సంభందించి పలు కారణాలు పురాణాలలో ప్రస్తావించబడినాయి.
క్రీ.పూ 6 వశతాబ్ధంలో సూరశేనుని సామ్రాజ్యానికి మథుర రాజధానిగా ఉండేది.క్రీ .పూ 4నుండి 2 వ శతాబ్ధం వరకు ఈ నగరం మౌర్యుల పాలనలో ఉంది.క్రీ.పూ 2వ శతాబ్ధంలో సుంగ సామ్రాజ్యంలో ఈ నగరం భాగమైంది.క్రీ.పూ 180నుండి 100 మద్య ఈ నగరం ఇండో-గ్రీక్ స్వాధీనంలో ఉన్నట్లు అంచనా.ఆర్కియాలజిస్టులు ఆధారాలను అనుసరించి రచయిత బౌకర్ రచనల ఆధారంగా క్రీ.పూ 100 నుండి ఇక్కడ అధికంగా జైన మతస్థులు నివసించినట్లు విశ్వసిస్తున్నారు.మథుర కళా శైలి,సంస్కృతి కుషాలుల పరిపాలనలో బౌద్ధమతంతో ప్రభావితమైయ్యాయి.మథుర వారి రాజధానులలో ఒకటి.రెండవది పెషావర్(పురుషపుర్).వాసుదేవ్ మనహాయించి కుషాలుల రాజులు కడ్ఫిసెస్,హువిష్క మరియు వాసుదేవ్.కషాలులందరూ బౌద్ద మతావలంబీకులు .
క్రీ .పూ 3 వశతాబధంలో భారతదేశంలో పర్యటించిన చైనా యాత్రికుడు మెగస్తనీస్ రచనలలో మథురానగర ప్రస్తావన ఉంది.ఆయన మథురా నగరాన్ని మెథొరా గా పేర్కొన్నాడు.
క్రీ.పూ 1నుండి 3 వ శతాబ్ధం వరకు మథుర కుషాల సామ్రాజ్య రాజధానులలో ఒకటిగా ఉంది.మథుర మ్యూజియం(పురాతన వస్తు ప్రదర్శనశాల)లో ఆసియాలోనే అధికంగా ఎర్రరాతి శిల్పాలు ఉన్నాయి.వీటిలో అధికంగా బుద్ధిని శిలారూపాలు చోటు చేసుకున్నాయి.
గజనీ మహమ్మద్ మథురా నగరాన్ని స్వాధీనపరచుకున్న తరవాత నగరంలోని అనేక ఆలయాలు పడగొట్టబడ్డాయి.1018లో ఈ నగరంలోని ఆలయాలు సికిందర్ పరిపాలనలో మరికొంత విద్వంశాన్ని చవిచూసాయి.ఔరంగజేబు పరిపాలనలో కేశవ్‌దేవ్ ఆలయంలోని కొంతభాగం విద్వంశం అయింది.ఔరంగజేబు చక్రవర్తి అదే ప్రదేశంలో జామీ మసీద్(శుక్రవార మసీదు)నిర్మించాడు.ఆలయంలోని అనేక రాళ్ళను మసీదు నిర్మాణంలో ఉపయోగించినట్లు అంచనా.ముఘల్ చక్రవర్తుల నుండి భరత్‌పూర్ రాజుల వశమై చివరకు మరాఠీయుల స్వంతమైంది.ప్రస్థుత కృష్ణుని ఆలయం 1815 లో గోకుల్దాస్ పరీఖ్ చే నిర్మించబడింది దీనిని ఇప్పుడు ద్వారకేశ్ ఆలయంగా పిలుస్తున్నారు.

[మార్చు] భౌగోళికం

మథురా నగరం దేశ రాజధాని ఢిల్లీకి దక్షిణంలో 145 దూరంలోనూ,ఆగ్రాకు ఉత్తరంలో 50 కిలోమీటర్లదూరంలోనూ ఉంది.తూర్పున ఆలీఘర్ పడమట రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన భరత్‌పూర్ ఉంది.ఢిల్లీ,ఆగ్రా నేషనల్ హైవే(ఎన్‌హెచ్-2, నేషనల్ హైవే -2) మార్గంలో ప్రయాణించి ఇక్కడకు చేరవచ్చు.ఇది రైల్వే జంక్షన్. ఢిల్లీ-ముంబై,ఢిల్లీ-చెన్నై రైళ్ళు మథుర జంక్షన్ నుండి మార్గం మార్చుకుంటాయి.నగరవైశాల్యం 3329.4 చదరపు కిలోమీటర్లు.

[మార్చు] పర్యాటక రంగం

మథురలో పర్యాటకరంగం ఇంకా అభివృద్ధి దశలో ఉంది.అధికంగా హిందూ మతసంబంధిత ప్రదేశాలను సందర్శించడానికి ఇక్కడకు సందర్శకులు వస్తుంటారు.

[మార్చు] మథురలో ప్రదాన దర్శనీయ ప్రదేశాలు

గురుదేవ్ ఆలయం
గురుదేవ్ ఆలయం
  1. కృష్ణజన్మభూమి.
  2. జైగురుదేవ్‌ ఆలయం.
  3. ద్వారకాదీష్ ఆలయం.
  4. ఖన్స్ ఖిలా.
  5. విష్రామ్ ఘాట్(యమునాతీరంలోని స్నానఘట్టం).

విష్రామ్‌ఘాట్ మథురలో ప్రధాన స్నానఘట్టం.కంస వధ తరవాత శ్రీకృష్ణుడు మరియు బలరాముడు ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని పురాణ కథనం.

[మార్చు] మథుర పరిసర ప్రాంతాలలో దర్శనీయ ప్రదేశాలు

  1. బర్సన.
  2. నందగోన్.
  3. గోకుల్.
  4. బృందావనం.
  5. గోవిందన్.
  6. రాధాకుండ్.
  7. మంట్.
  8. భరత్పూర్(రాజస్థాన్)
  9. డీగ్
  10. పక్షుల శరణాలయం.

[మార్చు] విద్య

మధుర లో ఉన్న పండిట్ దీనదయాళ్ ఉపాద్యాయ పసు వద్య విశ్వవియాలయం రాష్ట్రంలో మొదటిది దేశంలో నాల్గవది.ఈ విశ్వవిద్యాలయం మథుర-ఆగ్రా రోడ్డులో మథుర రైల్వే స్టేషనుకు 5 కిలోమీటర్ల దూరంలోనూ బస్ స్టాండుకు 4 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది.ప్రధాన విశ్వవిద్యాలయం భూభాగం మథురలో 782.32 ఎకరాలు మరియు ప్రధాన విశవిద్యాలయ భవనానికి 20 కిలోమీటర్ల దూరంలో మధురీకుండ్‌లో 1400 ఏకరాలు వీస్తీర్ణంలో ఉంది.

[మార్చు] పరిశ్రమలు

ప్రస్తుతం మథుర ప్రదాన రైలు మార్గంలోనూ ,బస్ మార్గంలోనూ ఉన్నందువలన ఇక్కడ భారత ప్రభుత్వానికి స్వంతమైన ఇండియన్ రిఫైనరీ పరిశ్రమ ఉంది.ఇది ఆసియాలోనే అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ.ఇక్కడ వెండి పాలిష్ చేసే పరిశ్రమలు,బట్టలు ప్రింటింగ్ చేసే పరిశ్రమలు,బట్టల మీద డిజైన్ అద్దకం పరిశ్రమలు మరియు నీటి పంపులు తయారీ ప్రసిద్ధం.
మథుర,బృందావనం నగరాలు ప్రముఖ జంట నగరాలలో ఒకటి.చిన్న నగరమైన బృందావనంలో

[మార్చు] జనసంఖ్య

2001 జనాభా లెక్కలననుసరించి మద్థుర జనసంఖ్య 298,827.వీరిలో పురుషులు 53%, స్త్రీలు 47%.సరాసరి అక్షరాస్యత 61%.ఇది దేశీయ సరాసరి అక్షరాశ్యత అయిన 59.5% కంటే అధికం.పురుషుల అక్షరాశ్యత 67%,స్త్రీల అక్ష్రాశ్యత 57%.6 సంవత్సరాలకన్నా తక్కువ వయసున్న పిల్లలు 14%.

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -