భూమి వాతావరణం
వికీపీడియా నుండి
నత్రజని | 78.0842% |
ఆమ్లజని | 20.9463% |
ఆర్గాన్ | 0.93422% |
కార్బన్ డై ఆక్సైడ్ | 0.03811% |
నీటి ఆవిరి | దాదాపు 1% |
ఇతర వాయువులు | 0.002% |
భూమి వాతావరణం, భూమ్యాకర్షణ శక్తి వల్ల భూమిని అంటిపెట్టుకుని ఉన్న వాయువులతో నిండి ఉన్న పొర. భూమిని ఆవరించి ఉన్న ఈ పొరలో సుమరుగా 78.08% నత్రజని, 20.95% ఆమ్లజని, 0.93% ఆర్గాన్, 0.038% కార్బన్ డై ఆక్సైడ్, అటూఇటుగా ఒక శాతం నీటి ఆవిరి మరియు అతిస్వల్ప పరిమాణాలలో ఇతర వాయువులు ఉన్నాయి. ఈ వాయువుల కలయికను సాధారణంగా గాలి అని పిలుస్తారు. భూమిపైన ఉన్న జీవరాసులను అతినీలిలోహిత కిరణాల బారినుండి కాపాడటానికి మరియూ పగలు/రాత్రుల ఉష్ణాగ్రతలను విపరీతమైన హెచ్చుతగ్గులకు లోనవకుండా చూడాటానికి ఈ వాతావరణం ఎంతయినా అవసరం.
ఫలాణా చోట భూవాతావరణాం అంతమై అంతరిక్షం మొదలౌతుందని విభజన రేఖ గీయటం కష్టం, అంతరిక్షం దగ్గరౌతున్నకొద్దీ వాతావరం కొద్ది కొద్దిగా పలుచబడిపోతుంది. వాతావణంలోని ముప్పావుభాగం భూమిచుట్టూ 11కీమీలలోనే కేంద్రీకృతమై ఉంటుంది. అంతరిక్షం నుండి భూమిని చేరుకుంటున్నప్పుడు భూమి ఉపరితలానికి 120కీమీల నుండే భూవాతావరణ ప్రభావాన్ని పసిగట్టవచ్చు. కొన్ని సంధర్భాలలో కార్మాన్ రేఖను భూవాతావరణానికీ, అంతరిక్షానికీ మధ్యన విభజన రేఖగా పరిగనిస్తూ ఉంటారు, ఇది భూమి ఉపరితలానికి 100కీమీల దూరంలో నెలకొని ఉంటుంది.
[మార్చు] ఉష్ణాగ్రతలు మరియూ పొరలు
భూమి ఉపరితలం నుండి ఎత్తులో ఉన్న దూరం ఆధారంగా వాతావరణంలోని ఉస్ణోగ్రతలు మారిపోతూ ఉంటాయి. ఈ మార్పుల ప్రకారం వాతావరణాన్ని ఐదు పొరలుగా విభజించారు.
[మార్చు] మూలాలు