భగ్గేశ్వరం
వికీపీడియా నుండి
భగ్గేశ్వరం పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలమునకు చెందిన గ్రామము.ఈ గ్రామము పాలకొల్లు మరియు భీమవరం ప్రధాన రహదారిపై పాలకొల్లుకు ఐదు కిలోమీటర్ల దూరంలో కలదు.ఇక్కడ పంజాబీలు ఉపయోగించే పగడీఅనబడే సిలుకు తలరుమాళ్ళూ నేయు నేతగాళ్ళు కలరు.మఠము అని పిలువబడే ప్రాంగణములో శివాలయము విష్ణాలయము మరియు అమ్మవార్ల ఆలయాలు కలవు.పాలకొల్లు సమీపముగా నుండుటచే అధికంగా అవసరాలకు రాకపోకలు సాగిస్తారు.ఊరిలో మంచినీటీకి తగిన వనరులు లేని కారణంగా పాలకొల్లు నుండి కేన్లతో ప్రతి రోజూ నీటిని తెచ్చుకొంటారు.
వర్గం:పశ్చిమగోదావరిజిల్లా గ్రామాలు