బ్రహ్మవైవర్త పురాణము
వికీపీడియా నుండి
|
|
---|---|
బ్రహ్మ పురాణములు | బ్రహ్మ · బ్రహ్మాండ · మార్కండేయ · భవిష్య · వామన · బ్రహ్మవైవర్త |
విష్ణు పురాణములు | విష్ణు · భాగవత · నారదీయ · గరుడ · పద్మ · వరాహ |
శివ పురాణములు | శివ · లింగ · స్కాంద · అగ్ని · మత్స్య · కూర్మ |
బ్రహ్మవైవర్త పురాణములో 18 వేల శ్లోకాలు ఉన్నాయి అని మత్స్య పురాణములోను, నారద పురాణము లోను చెప్పబడింది. కాని ఇప్పుడు 12 వేల పై చిలుకు శ్లోకాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ పురాణము నాలుగు భాగాలుగా విభజింపబడింది.
- బ్రహ్మ ఖండము
- ప్రకృతి ఖండము
- గణేశ ఖండము
- శ్రీ కృష్ణ ఖండము
ఈ పురాణములో శ్రీకృష్ణుడే పరాత్పరుడు గా వ్యాసమహర్షి వర్ణించాడు.
విషయ సూచిక |
[మార్చు] బ్రహ్మ ఖండము
ఈ ఖండములొ సృష్టి క్రమము వివరించబడింది.
[మార్చు] ప్రకృతి ఖండము
ఈ ఖండములో తులసి, రమ, సరస్వతి, దుర్గ, రాధ మెదలైన స్త్రీ దేవతల వృత్తాంతాలు , పూజావిధి , వారికి సంబంధించిన ధ్యానము, కవచము మెదలైన విషయాలు చెప్పబడ్డాయి.
[మార్చు] గణేశ ఖండము
ఈ ఖండము లో గణేశ జన్మ వృత్తాంతము చెప్పబడింది. అంతే కాకుండా పరశురామునికి కార్తవీర్యార్జునునికి మధ్య జరిగిన యుద్ధము వివరింపబడింది. ఈ ఖండములో గణేశ కవచము, దుర్గా కవచము, పుణ్యకవ్రతము మెదలైన విషయాలు చెప్పబడివవి. గణేశునికి గజ ముఖము రావడానికి కారణము, గణపతి ఏకదంతము పొందడానికి కారణము చెప్పబడింది.
[మార్చు] శ్రీకృష్ణ ఖండము
ఈ ఖండములొ శ్రీకృష్ణ జన్మవృత్తాంతము చెప్పబడింది.
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |