Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
బొప్పాయి - వికీపీడియా

బొప్పాయి

వికీపీడియా నుండి

బొప్పాయి
పచ్చి కాయలతో ఉన్న చెట్టు పైభాగం
పచ్చి కాయలతో ఉన్న చెట్టు పైభాగం
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
విభాగము: Magnoliophyta
తరగతి: Magnoliopsida
వర్గము: Brassicales
కుటుంబము: Caricaceae
ప్రజాతి: Carica
జాతి: C. papaya
ద్వినామము
Carica papaya
L.

మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. 2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా. ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట.

విషయ సూచిక

[మార్చు] అనువైన వాతావరణం

బొప్పాయి ఉష్ణమండలపు పంట. సముద్ర మట్టం నుంచి 1000 మీ. ఎత్తువరకు పెంచవచ్చు. వేసవిలో 32 డిగ్రీల సెం.గ్రే. నుంచి 38 డిగ్రీల సెం.గ్రే వరకు తట్టుకుంటుంది. చలికాలంలో 5 డిగ్రీల సెం.గ్రే.కి తక్కువ ఉండరాదు. బొప్పాయి సాగుకు సారవంతమైన ఎర్రగరప నేలలు, ఒండ్రు నేలలు అనుకూలం. వీటితోపాటు తేలికగా నీరు ఇంకిపోయే రేగడి నేలల్లో కూడా సాగుచేయవచ్చును. నీరు నిలిచే నేలలు, అధిక చౌడు, ఆమ్ల భూములు, సున్నపురాయి గల నేలలు బొప్పాయి పంటకు పనికిరావు. బొప్పాయికి అధిక గాలుల నుంచి రక్షణ అవసరం.

[మార్చు] రకాలు

బొప్పాయిలో అనేక రకాలున్నాయి. వీటిలో ముఖ్యంగా రెండు రకాలు

[మార్చు] డయీషియస్‌

ఇవి ఆడ, మగ పుష్పాలు వేరువేరుగా పూసే చెట్ల రకాలు. వీటిలో గుజ్జు పసుపురంగులో ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు

  • వాషింగ్టన
  • కో-4
  • కో-6
  • హానీడ్యూ

[మార్చు] గైనో డయీషియస్

ఇవి ఆడపుష్పాలు, ఆడపుష్పాలతోపాటు ద్విలింగ పుష్పాల రకాలు. వీటిలో గుజ్జు ఆరంజి రంగులో తియ్యగా ఉంటుంది. ఈ జాతిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ రకాలు

  • కూర్గు హనీడ్యూ
  • సోలో
  • కో-3
  • పూసా డెలీషియస్
  • రెడ్‌ లేడీ (786)

ప్రస్తుతం పండ్ల కోసం భారతదేశంలో ఈ రకాలే ప్రాచుర్యంలో ఉన్నాయి.

[మార్చు] ఇతర రకాలు

  • బొప్పాయి కాయల నుంచి పాలు సేకరించి పపైన్‌ (Papain) తయారీకోసం కో-2, కో-5 రకాలు సాగుచేస్తున్నారు.
  • పచ్చికాయలు కూరకోసం పూసాజెయింట్‌ రకం అనువుగా ఉంటుంది.
  • పూసా మెజెస్టీ, రెడ్‌ లేడీ రకాలు ఎక్కువ రోజులు నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండటంతోపాటు దూర ప్రాంతాల రవాణాకు అనుకూలం.
  • పెరటి తోటల్లోనూ, ఇంటి ఆవరణలోనూ అందంగా పెంచుకోవటానికి పూసాడ్వార్ఫ్‌ రకం అనుకూలం.
  • నీటి ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో నాటుకోవటానికి పూసా నానా రకం అనుకూలంగా ఉంటుంది.
  • రంగు, రుచి కలిగిన చిన్న కాయల కోసం 'సోలో', ఆర్క సూర్య రకాలు సాగు చేయవచ్చు.

[మార్చు] పోషక విలువలు

  • మామిడి పండు తర్వాత బొప్పాయిలోనే మనకు అధిక పరిమాణంలో విటమిన్ ఎ లభిస్తుంది. దీనితోపాటు బి1, బి2, బి3, సి-విటమిన్లు, కాల్షియం, ఇనుము, భాస్వరం వంటి ఖనిజ లవణాలు బొప్పాయిలో సమృద్ధిగా లభిస్తాయి. ఆహారం జీర్ణమవడం, మలబద్ధకం నివారణలోనూ, కాలేయం, పిత్తాశయ వ్యాధుల నివారణలోనూ, జీర్ణాశయంలో అల్సర్ల నివారణలోనూ బొప్పాయి పండ్లు ఉపయోగపడతాయి.
  • కంటికి సంబంధించిన రోగాలు రాకుండా ఈ పండులోని బిటాకెరోటిన్‌ (2020 ఐ.యూ.) తోడ్పడుతుంది.
  • బొప్పాయిలో సమృద్ధిగా లభించే విటమిన్ సి (40 మి.గ్రా.) దంతాల, చిగుళ్ళ ఆరోగ్యానికి, రక్తవృద్ధికి, రోగనిరోధక శక్తికి తోడ్పడుతుంది.
  • విటమిన్‌ బి (రైబోఫ్లెవిన్‌ 250 మైక్రోగాములు) నోటి పూత, తెల్లమచ్చలు, పెదాల పగుళ్లు రాకుండా కాపాడుతుంది.
  • బొప్పాయి 'కాయ' జీర్ణానికి తోడ్పడితే, 'పండు' పోషకాలనిస్తుంది.
  • బొప్పాయి పండును చిన్న పిల్లలకు గుజ్జుగా చేసి నాలుగో నెలనుంచి తినిపించవచ్చు. యుక్తవయస్సులో ఉన్నవారు దోరగా పండిన పండును తినవచ్చు.

[మార్చు] జాగ్రత్తలు

బొప్పాయి కాయలు గర్భస్రావాన్ని కలుగజేస్తాయి. దీనికి ముఖ్యకారణం అందులో ఉండే 'పపైన్‌' (పాలు). ఇది గర్భాశయంలో ప్రారంభదశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న పిండం చుట్టూ ఉండే ప్రొటీనులను కరిగించివేస్తుంది. అందువల్ల గర్భిణిస్త్రీలు, పాలిచ్చు తల్లులు బాగా పండిన బొప్పాయి పండు తినటం మంచిది.

[మార్చు] అపోహలు

బొప్పాయి పండ్ల వినియోగంపై గ్రామీణ, పట్టణ వాసులకు కూడా అనేక అపోహలున్నాయి. బొప్పాయి తింటే వేడి చేస్తుందని, గర్భిణి స్త్రీకి గర్భస్రావం అవుతుందని, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని, బహిస్టు సమయంలో స్త్రీలు తింటే రక్తస్రావం ఎక్కువ అవుతుందని, ముసలివారికి, పిల్లలకు అజీర్ణం చేస్తుందని ఇలా ఎన్నో అపోహలున్నాయి. వీటిలో నిజం లేదని శాస్త్రీయంగా రుజువయ్యింది. అంతేకాకుండా బొప్పాయిలో లభ్యమయ్యే అనేక పోషకాలు మన ఆరోగ్య పరిరక్షణకు చాలా అవసరం.

[మార్చు] వనరులు


Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com