బొగద
వికీపీడియా నుండి
బొగద, ప్రకాశం జిల్లా, గిద్దలూరు మండలానికి చెందిన గ్రామము. బొగద నల్లమల్ల అడువులలో ఉన్న అటవీ గ్రామము. ఇది నంద్యాల - గిద్దలూరు మార్గమున చెలిమ మరియు దిగువమెట్ట రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది. బొగదలో ప్యాసింజరు రైళ్లు ఆగే ఒక చిన్న రైల్వేస్టేషను కూడా కలదు. ఇక్కడ ముఖ్యంగా చెంచులు, బోయలు నివసిస్తున్నారు.
పూర్వము బొగద చుట్టుపక్కల అటవీప్రాంతములో పులులు, చిరుతలు ఎక్కువగా సంచరిస్తూ ఉండేవి 1950వ దశకములో బ్రిటీషు సాహసికుడు కెన్నెత్ ఆండర్సన్ ఒక నరభక్షక చిరుతను వేటాడిన వైనాన్ని బ్లాక్ పాంథర్ ఆఫ్ శివానిపల్లి అనే పుస్తకంలో సవివరంగా వర్ణించాడు.[1]
బొగద వద్ద నిర్మించిన 1565 మీటర్ల పొడవున్న రైల్వే సొరంగము దక్షిణ మధ్య రైల్వే విభాగములో అత్యంత పొడవైన సొరంగము.[2] గిద్దలూరు నంద్యాల రైలు మార్గాన్ని మీటరు గేజీ నుండి బ్రాడ్ గేజిగా గేజిమార్పిడి పనులలో భాగంగా బ్రిటీషు కాలములో కట్టిన సొరంగానికి బదులుగా నిర్మించిన ఈ కొత్త సొరంగాన్ని అక్టోబర్ 14, 1994న పనులు ప్రారంభించి 1996 ఫిబ్రవరి వరకు 15 నెలల కాలములో నిర్మించారు. రైల్వేలైనులోని ఈ భాగాన్ని అప్పటి భారత ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు 1996 మార్చి 9న ప్రజలకు అంకితం చేశాడు.[3]
ఇటీవల ఈ ప్రాంతాలలో నక్సలైట్ల ప్రభావము ఎక్కువైనందువలన బొగద నక్సలైటు ఎన్కౌంటరు వార్తలలోకెక్కుతున్నది[4].
[మార్చు] మూలాలు
- ↑ బ్లాక్ పాంథర్ ఆఫ్ శివానిపల్లి - కెన్నెత్ ఆండర్సన్ [1] పేజీ.143
- ↑ http://www.scrailway.gov.in/web/construc_tion.htm
- ↑ Tunnelling Asia 2000: Proceedings of the International Conference, New Delhi By S. P. Kaushish, T. Ramamurthy పేజీ.447[2]
- ↑ http://news.oneindia.in/2007/08/07/naxal-killed-in-encounter-in-ap-village-1186470592.html
|
|
---|---|
అంబవరము · ఆదిమూర్తిపల్లె · బొగద (నిర్జన గ్రామము) · చట్టిరెడ్డిపల్లి · గడికోట · కొత్తపల్లి · గిద్దలూరు · ఇసుకగుండం గూడెం · కంచిపల్లి · కొమ్మునూరు · కొంగలవీడు · కొత్తకోట · క్రిష్టంశెట్టిపల్లి · మాలకొండపెంట గూడెం (నిర్జన గ్రామము) · మోడంపల్లి · ముండ్లపాడు · నరసింహునిపల్లి · నరవ · పొదలకొండపల్లి · సంజీవరావుపేట · దేవనగరం · తంబళ్లపల్లి · తిమ్మాపురం · త్రిపురాపురం · ఉయ్యాలవాడ |