బనగానపల్లె
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?బనగానపల్లె మండలం కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి) | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | బనగానపల్లె |
జిల్లా(లు) | కర్నూలు |
గ్రామాలు | 38 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
89,030 (2001) • 45555 • 43475 • 53.79 • 67.19 • 39.77 |
భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బనగానపల్లె ఒక చిన్న పట్టణం మరియు మండలము. కర్నూలు జిల్లలో నున్న బనగానపల్లె 1790 నుండి 1948 వరకు అదే పేరు కలిగిన సంస్థానం గా ఉండేది.
[మార్చు] చరిత్ర
1601 లో బీజాపూరు సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్ షా బనగానపల్లె కోటను రాజా నంద చక్రవర్తిని ఓడించి వశపరచుకున్నాడు. ఆక్రమిత ప్రాంతాన్ని, కోటను ఈ విజయం సాధించిన సేనాధిపతి, సిద్ధు సంబల్ ఆధీనంలో 1665 వరకు ఉన్నాయి. మహమ్మద్ బేగ్ ఖాన్-ఇ రోస్బహాని బనగానపల్లె జాగీరుపై శాశ్వత హక్కు పొందాడు. కాని అతడు మగ వారసులు లేకుండా చనిపోవడంతో జాగీరు అతని మనవడూ దత్తపుత్రుడూ అయిన ఫైజ్ ఆలీ ఖాన్ బహదూరు కు ధారాదత్తమైంది. మొగలు చక్రవర్తిఔరంగజేబు 1686లో బీజాపూరును ఆక్రమించుకొన్నపుడు, దక్కనులో అతని ప్రతినిధిగా పనిచేసే ఫైజ్ ఆలీ మేనమామ, ముబారిజ్ ఖాన్ దయవల్ల ఫైజ్ ఆలీ ఖాన్ స్థానం పదిలంగానే ఉంది.
అప్పటినుండి బనగానపల్లెను మొగలు చక్రవర్తుల సామంతులు గా కొన్నాళ్ళు, ఆ తరువాత 1724 లో మొగలుల నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకొన్న హైదరాబాదు నిజాము సామంతులుగా కొన్నాళ్ళు ఫైజ్ వారసులే పాలించారు. అతడు కూడా మగ వారసులు లేకుండా మరణించడంతో, అతని మనుమడు హుసేన్ ఆలీ ఖాన్ బనగానపల్లెకు ప్రభువయ్యాడు. అతని పాలన చివరి రోజుల్లో మైసూరు రాజు హైదరాలీ సామ్రాజ్య విస్తరణ చేయడాన్ని గమనించి అతనికి సామంతుడిగా మారిపోయాడు. 1783లో హుసేను మరణించాక, అతని కుమారుడు, చిన్నవాడైన గులాం మొహమ్మదాలి -మామ రాజ ప్రతినిధిగా- రాజయ్యాడు. ఒక ఏడాది లోనే హైదరాలి వారసుడైన టిప్పు సుల్తాను వాళ్ళను బనగానపల్లె నుండి తరిమివేయగా, వాళ్ళు హైదరాబాదు లో తలదాచుకున్నారు. మళ్ళీ 1789 లో బనగానపల్లె కు తిరిగి వచ్చారు. తరువాత కొన్నాళ్ళకు, దగ్గరలోని చెంచెలిమల జాగీరును వియ్యం ద్వారా కలుపుకున్నారు.
1800 తొలినాళ్ళలో బనగానపల్లె బ్రిటిషు ఇండియా లో ఒక సంస్థానం గా మారిపోయింది. ఆర్ధిక లావాదేవీలలో జరిగిన లొసుగుల కారణంగా 1832 నుండి 1848 వరకు ఒకసారి, 1905 లో కొన్ని నెలలపాటు మరోసారి బనగానపల్లె పరిపాలనను మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నరు తన అధీనంలోకి తీసుకున్నాడు. 1901 లో బనగానపల్లె సంస్థానం 660 చ కి మీ ల వైశాల్యంతో 32,264 జనాభాతో ఉండేది. 1948 లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని కర్నూలు జిల్లాలో భాగమయింది. 1953 లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి ఆంధ్ర రాష్ట్రం గా ఏర్పడ్డాయి.
[మార్చు] గ్రామాలు
- అప్పలాపురం
- బనగానపల్లె
- బానుముక్కల
- బత్తులూరుపాడు
- బీరవోలు
- చెర్లొకొత్తూరు
- చేరుపల్లె
- ఎనకండ్ల
- గులాం నబీపేట
- గులాంఅలియాబాద్
- హుస్సేనాపురం
- ఇల్లూరు - కొత్తపేట
- జంబులదిన్నె
- జిల్లెల్ల
- జ్వాలాపురం
- కాపులపల్లె
- కటికవానికుంట
- కృష్ణగిరి
- కైప
- మీరాపురం
- మిట్టపల్లె
- నందవరం
- నందివర్గం
- నిలువుగండ్ల
- పలుకూరు
- పండ్లపురం
- పసుపుల
- పాతపాడు
- రాళ్లకొత్తూరు
- రామతీర్థం
- సలమాబాద్ (నిర్జన గ్రామము)
- శంకలాపురం
- టంగుటూరు
- తమ్మడపల్లె
- తిమ్మాపురం
- వెంకటాపురం (బనగానపల్లె)
- విట్టలాపురం
- యాగంటిపల్లె
- యెర్రగుడి
- యాగంటి
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
కౌతాలం • కోసిగి • మంత్రాలయము • నందవరము • సి.బెళగల్ • గూడూరు • కర్నూలు • నందికోట్కూరు • పగిడ్యాల • కొత్తపల్లె • ఆత్మకూరు • శ్రీశైలం • వెలుగోడు • పాములపాడు • జూపాడు బంగ్లా • మిడ్తూరు • ఓర్వకల్లు • కల్లూరు • కోడుమూరు • గోనెగండ్ల • యెమ్మిగనూరు • పెద్ద కడబూరు • ఆదోని • హొలగుండ • ఆలూరు • ఆస్పరి • దేవనకొండ • క్రిష్ణగిరి • వెల్దుర్తి • బేతంచెర్ల • పాణ్యం • గడివేముల • బండి ఆత్మకూరు • నంద్యాల • మహానంది • సిర్వేల్ • రుద్రవరము • ఆళ్లగడ్డ • చాగలమర్రి • ఉయ్యాలవాడ • దొర్నిపాడు • గోస్పాడు • కోయిలకుంట్ల • బనగానపల్లె • సంజామల • కొలిమిగుండ్ల • ఔకు • ప్యాపిలి • ధోన్ • తుగ్గలి • పత్తికొండ • మద్దికేర తూర్పు • చిప్పగిరి • హాలహర్వి |
|
|
---|---|
అప్పలాపురం · బనగానపల్లె · బానుముక్కల · బత్తులూరుపాడు · బీరవోలు · చెర్లొకొత్తూరు · చేరుపల్లె · ఎనకండ్ల · గులాం నబీపేట · గులాంఅలియాబాద్ · హుస్సేనాపురం · ఇల్లూరు - కొత్తపేట · జంబులదిన్నె · జిల్లెల్ల · జ్వాలాపురం · కాపులపల్లె · కటికవానికుంట · కృష్ణగిరి · కైప · మీరాపురం · మిట్టపల్లె · నందవరం · నందివర్గం · నిలువుగండ్ల · పలుకూరు · పండ్లపురం · పసుపుల · పాతపాడు · రాళ్లకొత్తూరు · రామతీర్థం · సలమాబాద్ (నిర్జన గ్రామము) · శంకలాపురం · టంగుటూరు · తమ్మడపల్లె · తిమ్మాపురం · వెంకటాపురం (బనగానపల్లె) · విట్టలాపురం · యాగంటిపల్లె · యెర్రగుడి |