Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
నిర్మలా దేశ్ పాండే - వికీపీడియా

నిర్మలా దేశ్ పాండే

వికీపీడియా నుండి

ప్రముఖ గాంధేయవాది అయిన నిర్మలా దేశ్‌ పాండే (Nirmala Deshpande) 1929, అక్టోబర్ 17న మహారాష్ట్ర లోని నాగపూర్ లో జన్మించింది. ఆమె తండ్రి ప్రముఖ మరాఠి రచయిత పి.వై. దేశ్‌పాండే. వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమంలోనూ, భారత్-పాక్ శాంతి యాత్రలోనూ, టిబెట్ సమస్య పరిష్కారంలోనూ చురుగ్గా పాల్గొన్నది. జీవితాంతం గాంధేయ మార్గానికి కట్టుబడి అవివాహితురాలిగానే కొనసాగింది. సుమారు 60 సంవత్సరాలపాటు గాంధేయ భావాలతో కొనసాగి 2008, మే 1న ఢిల్లీలో 79వ యేట తుదిశ్వాస వదిలింది.

విషయ సూచిక

[మార్చు] జీవనం

నిర్మలా దేశ్‌పాండే 1929, అక్టోబర్ 29న మహారాష్ట్ర లోని నాగ్పూర్‌లో విమల మరియు పి.వై.దేశ్‌పాండే జన్మించింది. తండ్రి ప్రముఖ మరాఠీ రచయిత. విద్యాభ్యాసం స్థానికంగా నాగపూర్‌లోనే కొనసాగింది. నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచే ఎం.ఏ. పట్టా పొందినది. 1997 ఆగష్టులో తొలిసారిగా రాజ్యసభకు నియమితురాలయ్యింది. మళ్ళీ 2004 జూన్లో రెండవ సారి రాజ్యసభ సభ్యురాలిగా నియమించబడింది.[1]

[మార్చు] సామాజిక ఉద్యమంలో పాత్ర

1952లో వినోబా భావే ప్రారంభించిన భూదానోద్యమం ద్వారా నిర్మలా దేశ్‌పాండే సామాజిక ఉద్యమంలో అడుగుపెట్టింది. వినోభాతో కలిసి 40,000 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఈ యాత్ర సమయంలో దాతలనుంచి అనేక వేల ఎకరాల భూములను సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టారు.[2]

[మార్చు] శాంతి యాత్రలు

కాశ్మీర్‌లో మరియు పంజాబ్ లో మతకలహాలు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు నిర్మలా దేశ్‌పాండే ఆ ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు శాంతి సందేశాలు అందించింది. 1996లో భారత్-పాకిస్తాన్ శాంతి సదస్సులో పాల్గొన్నది. టిబెట్టు సమస్య పరిష్కారానికి కూడా తన వంతు కృషిచేసిన మహనీయురాలు నిర్మలా దేశ్‌పాండే.

[మార్చు] రచనలు

నిర్మలా దేశ్‌పాండే హిందీలో అనేక నవలలు రచించింది. అందులో ఒకదానికి జాతీయ అవార్డు కూడా లభించింది. వినోబా భావే జీవిత చరిత్ర కూడా లిఖించింది.

  • ముఖ్యమైన రచనలు: [3]
    • వినోభాకే సాథ్ (హిందీ, మరాఠీ, తెలుగు, గుజరాతీ సంచికలు)
    • క్రాంతి కా రాహ్ పర్ (హిందీ మరియు మరాఠీ సంచికలు)
    • చింగ్లింగ్ (హిందీ, మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్ సంచికలు)
    • సీమంత్ (మరాఠీ)
    • వినోభా (మరాఠీ, హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ)
    • సేవాగ్రం తే సేవాగ్రం (మరాఠీ)
    • భగ్నమూర్తి (హిందీ)

[మార్చు] అవార్డులు

2006లో నిర్మలా దేశ్‌పాండేకు భారత ప్రభుత్వము పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించింది. రాజీవ్ గాంధీ జాతీయ సద్భావన అవార్డు కూడా లభించింది.

[మార్చు] మరణం

జీవితమంతా గాంధేయవాదిగా ఉంటూ, సామాజికవాదిగా సేవలని అందించిన నిర్మలా దేశ్‌పాండే 79వ యేట 2008, మే 1న ఢిల్లీలో తుదిశ్వాస వదిలింది.

[మార్చు] బయటి లింకులు

[మార్చు] మూలాలు

  1. http://india.gov.in/govt/rajyasabhampbiodata.php
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ ఎడిషన్, పేజీ 5
  3. http://india.gov.in/govt/rajyasabhampbiodata.php
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com