నార్ల వెంకటేశ్వరరావు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
నార్ల వెంకటేశ్వరరావు | |
జననం | డిసెంబర్ 1, 1908 జబల్పూర్, మధ్య ప్రదేశ్[1] |
---|---|
మరణం | మార్చి 13, 1985 |
ఇతర పేర్లు | వీ.ఆర్.నార్ల |
వృత్తి | పాత్రికేయుడు |
రాజకీయ పార్టీ | కాంగ్రేసు పార్టీ |
భార్య/భర్త | సులోచనా దేవి |
సంతానం | 3 కుమారులు, 5 కుమార్తెలు |
తండ్రి | లక్ష్మణ రావు |
తల్లి | మహాలక్ష్మి |
నార్ల వెంకటేశ్వరరావు తెలుగునాట ప్రముఖ జర్నలిస్టు. వీ.ఆర్.నార్ల గా కూడా వీరు ప్రసిద్ధులు. ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు. హేతువాదిగా,మానవతావాదిగా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించాడు.
[మార్చు] రచనలు
- నార్ల రచనలు 1 - దేశ చరిత్రలు
- నార్ల రచనలు 2 - సాంఘిక నాటికలు, వ్యాసాలు
- నార్ల రచనలు 3 - పౌరాణిక నాటికలు
- నార్ల రచనలు 4 - సాహిత్య రచనలు
- నార్ల రచనలు 5 - సంస్కృతి, సాహిత్యం, మతం
- నార్ల రచనలు 6 - వర్తమాన సంఘటనలు
- నార్ల రచనలు 7 - జీవిత చిత్రణలు
[మార్చు] బయటి లింకులు
- మాడ్రన్ రేషనలిస్ట్లో నార్లపై ఆయన సహచరుడు నరిశెట్టి ఇన్నయ్య వ్యాసం