Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
తెలుగు వికీపీడియా - వికీపీడియా

తెలుగు వికీపీడియా

వికీపీడియా నుండి

తెలుగు వికీపీడియా లోగో
తెలుగు వికీపీడియా లోగో
అంతర్జాల తెలుగు బాషాభిమానులు - హైదరాబాదులో తెలుగు వికీ పీడియన్లు, బ్లాగర్ల సమావేశం - ఈనాడు ఆదివారం అనుబంధం పత్రికలో వచ్చినది. (మధ్యలో తెలుగుతల్లి విగ్రహ చిత్రం పత్రిక వారు గ్రాఫిక్స్ ద్వారా సంకేత సూచకంగా కూర్చారు.)
అంతర్జాల తెలుగు బాషాభిమానులు - హైదరాబాదులో తెలుగు వికీ పీడియన్లు, బ్లాగర్ల సమావేశం - ఈనాడు ఆదివారం అనుబంధం పత్రికలో వచ్చినది. (మధ్యలో తెలుగుతల్లి విగ్రహ చిత్రం పత్రిక వారు గ్రాఫిక్స్ ద్వారా సంకేత సూచకంగా కూర్చారు.)

తెలుగు వికీపీడియా తెలుగు బిడ్డలు తెలుగులో వ్రాసుకుంటున్న విజ్ఞాన పేఠిక. విజ్ఞానాన్ని ఒకచోట భద్రపరుస్తున్న ఆధునిక తెలుగు వేదం. మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా ఆరంభించి స్వచ్చందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చాలన్న ఊహ రూపుదాల్చి పలువురి ఆదరాభిమానాన్ని చూరగొని విజయవంతంగా నడక సాగించింది. ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరవాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అనే విజ్ఞాన సర్వస్వం అభివృద్ధి పధంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే తెలుగు వికీపీడియా ఆవిర్భావం. సాధారణంగా వికీపీడియాలో పనిచేసేవారందరూ స్వచ్ఛందంగా పనిచేస్తారు. మాతృభాష మీద ఉండే అభిమానమే అందుకు కారణం. దీనిలో పనిచేసేవారు వివిధ రంగాలలో నిష్ణాతులు అవిశ్రాంతంగా వారి వారి భాద్యతలలో మునిగి ఉన్నవారే. భాషాభిమానం వారిని తెలుగు వికీపీడియా కోసం కొంత సమయం కేటాయించేలా చేస్తుంది. సభ్యులలో అనేకమంది తెలుగు వికీపీడియాతో అనుభందం పెంచుకున్నవారే.

విషయ సూచిక

[మార్చు] తెలుగు వికీపీడియా ఆవిర్భావం

తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టింది వెన్న నాగార్జున. బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పని చేస్తున్న వెన్న నాగార్జున రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. క్రమంగా తెలుగు భాషాభిమానులను ఇది విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించి అంగీకారాన్ని తెలిపారు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబర్ 9న ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియాలోని మొదటి లోగోని రూపొందించిన ఘనత ఆయనదే.

[మార్చు] తెలుగు వికీపీడియా అభివృద్ధి

2003లో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్ట్ వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరవాతి ఘట్ట ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార గుంపులలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావ్ వేమూరి, మిచిగాన్ విశ్వ విద్యాలయంలో ఆచార్యులుగా భాద్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. కట్టమంచి వ్రాసిన శ్రీనాధుని పద్యాలను శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను రంగరించి వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) విహారకులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఇలా తెలుగు వికీపీడియా అభివృద్ధి పధంలో నడవడం ప్రారంభించింది. తరవాతి దశలో కాలిఫోర్నియాలో ఉండే వాకా కిరణ్, మైక్రో సాప్ట్ లో పనిచేస్తూ హైదరాబాదులో నివసిస్తున్న చావాకిరణ్‌ లాంటి వారి కృషి అభివృద్ధికి కీలకమైంది. 2005 నాటికి 55 మంది సభ్యులు తమ సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. వ్యాసాల సంఖ్య 110 కి చేరింది.

మిన్నిసోటా నివాసి ప్లాంట్ మాలిక్యులర్ బయాలజీలో పరిశోధనా బాధ్యతలను నిర్వహిస్తున్న వైజాసత్య, బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న మాకినేని ప్రదీపు, హైదరాబాదు కూకట్‌పల్లి నివాసి సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ కంపనీలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ భాద్యతలను నిర్వహిస్తున్న చదువరి(తుమ్మల శిరీష్) మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది. వీరిలో 2005లో ఏప్రిల్ మాసంలో వైజాసత్య యధాలాపంగా గూగుల్ లోఅన్వేషణలో యాదృచ్చికంగా తెలుగు వికీపీడియాను చేరారు. అప్పటినుండి తెవికీ కోసం కొంతకాలం ఒంటరి పోరాటం చేసిన తదుపరి 2005లో జూలై చివరి దశలో చదువరి రాకతో తెవికీ కొత్త ఊపందుకుంది. వీరిద్దరి కృషిలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 డిసెంబర్ నాటికి వ్యాసాల సంఖ్య 2000కి చేరింది.

2006లో వీవెన్ (వీర వెంకట చౌదరి) రాకతో తెవీకీ రూపురేఖలు సుందరంగా తయారుకావడం ఆరంభమైంది. బిజినెస్ అనలిస్ట్ అయిన వీవెన్ వెబ్ డిజైనింగ్ మీద ఉన్న ఆసక్తితో ఆయనను హెచ్ టి ఎమ్ ఎల్ (HTML)నేర్చుకునేలా చేసింది. ఈయన ఏర్పాటు చేసిన బ్లాగర్ల సమావేశం ఇచ్చిన ప్రేరణతో వీవెన్ లేఖిని అనే అనువాద పరికరాన్ని సృష్టించాడు. పద్మ సాంకేతిక పరిజ్ఞానంతో లేఖినిని సృష్టించినట్లు ఆయనే చెప్పుకోవడం ఆయన నిజాయితీకి నిదర్శనం. 2006 మే నాటికి 3,300 వ్యాసాలతో భారతీయ భాషలలో తెవీకీ అగ్రస్థానాన్ని చేరుకుంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారికృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలవడంతో వ్యాసాల సంఖ్య 3,000కి చేరింది. కాజా సుధాకరబాబు ఓమన్లో ఎలక్ట్రికల్ ఇంజినీర్. ఈయన వ్యాసాల ప్రాజక్ట్‌లను రూపొందించి ఆయారంగాలలో ఆసక్తి ఉన్న వారు ఆయా వ్యాసాలు రూపొందించడానికి కృషి చేశారు. చిట్టెల్ల కామేశ్వరరావు బి ఎస్ ఎన్ ఎల్(BSNL) ఉద్యోగి. శ్రీనివాసరాజు హైదరాబాదులోనూ, సురేంద్ర నవీన్ బెంగుళూర్ లోనూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పని చేస్తున్నారు. వీరి కృషితో 2006 చివరికి వ్యాసాల సంఖ్య 6,000కి చేరింది.

2007లో చేరిన బ్లాగేశ్వరుడు (ఈయన అసలుపేరు శ్రీనివాస శాస్త్రి) లండన్‌లో శిశువైద్యుడు. పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో ఈయన కృషి అధికం. ఈయనతో చేతులు కలిపిన కళాకారుడు విశ్వనాధ్ కృషి పుణ్యక్షేత్రాల వ్యాసాలను అభివృద్ధి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. రంగారెడ్డి జిల్లాకి చెందిన ప్రభుత్వోద్యోగి చంద్ర కాంత రావు కృషి ఆర్ధిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. ఈ మాట వెబ్ పత్రిక సృష్టికర్త కొలిచాల సురేష్, ఇంద్రగంటి పద్మ, కంప్యూటర్ పత్రిక సంపాదకుడు నల్లమోతు శ్రీధర్‌ మొదలైన వారు సాంకేతిక సాయం చేస్తున్నారు. వీరందరితో పోలిస్తే విక్షనరీ కోసం కృషిచేస్తున్న టి.సుజాత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆవిడ సాధారణ గృహిణి అయి ఉండి కేవలం తెలుగు భాష మీద అభిమానంతో విక్షనరీలోనే కాకుండా తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషికొనసాగిస్తున్నారు. చిట్కాలను, ప్రకటనలను అందిస్తూ సాకేతికంగా కృషి చేస్తున్న సభ్యుడు దేవా. వీరే కాకుండా అప్పుడప్పుడూ వస్తూ పాల్గొనేవారు కొందరు. ఇలా అభివృద్ధి పధంలో సాగుతున్న తెవీకీలో ప్రస్తుత సమయానికి 40,429 వ్యాసాలతో భారతీయ భాషలలో ప్రథమ స్థానంలో ఉంటూ, అనేక విషయాలను తెలుగులో అన్వేషించి తెలుసుకునేలా పాఠకులకు తోడ్పడుతుంది.ఇస్లాము గురించి అనేక వివరాలనూ,ఉర్ధూ భాష గురించిన వివరాలను అందిస్తూ నిస్సార్ విశేష కృషి అపారం.

[మార్చు] ఎలాంటి విషయాలు వ్రాయాలి

కుక్కపిల్ల సబ్బుబిళ్ళ కాదేదీ కవితకనర్హం అన్నారు శ్రీశ్రీ ఆ వాఖ్య చక్కగా వికీపీడియాకు సరిపోతుంది. అనంతమైన ఆకాశం నుండి మట్టి రేణువు వరకూ దేనిని గురించైనా వ్రాయవచ్చు. మనకు తెలిసిన విషయం ఏదైనా భాషా పరిజ్ఞానం ఉంటే వ్రాయచ్చు. ఎంత చిన్న విషయమైనా సరే నిరభ్యంతరంగా వ్రాయవచ్చు. అచ్చుతప్పులుంటే సరిదిద్ద వచ్చు. వ్రాయడానికి సభ్యత్వం అవసరం లేదు కానీ సభ్యత్వం ఉంటే ఇతర సభ్యుల సలహాలు, సూచనలు అందుకునే అవకాశం ఉంది, ఇతర సభ్యులకు తో సంప్రదింపులు జరపటానికి వీలు కలుగుతుంది. ప్రాజక్టులుగా, వర్గాలుగా విడదీసి పనులు జరుగుతుంటాయి కనుక ఆసక్తి ఉన్న రంగంలో వ్రాసే వీలుంది. విస్తారమైన సమాచారం ఉంటుంది కనుక చదివి తెలుసుకోవడమూ చక్కని అనుభవమే.

[మార్చు] తెలుగు వీకీపీడియా బ్లాగులూ

తెలుగు వికీపీడియా సభ్యులకు కొంతమందికి స్వంత బ్లాగులూ ఉన్నాయి.వ్రాసే అలవాటు,తెలుగు మీద ఉన్న అభిమానం,తెలుగు భాషమీద పట్టు వాటిలో పస్పుటంగా కనిపిస్తుంది.పరిణితి చెందిన భాషాజ్ఞానం వాటిలో చూడవచ్చు.బ్లాగులంటే వారి స్వంత భావాలకు అద్దాలు.

[మార్చు] అధికారులు

[మార్చు] నిర్వాహకులు

నిర్వాహకుని పేరు మొదటి దిద్దుబాటు చేసిన తేది నిర్వాహకులైన తేది
నాగార్జున 20.11.04
వైజాసత్య 30.04.05 20.06.05
చదువరి 30.07.05 24.08.05
చావాకిరణ్‌ 08.12.04 02.09.05
ప్రదీపు 15.04.05 31.01.06
వీవెన్ 23.02.06 14.09.06
త్రివిక్రం 25.12.05 14.09.06
కాసుబాబు 31.07.06 03.01.07
నవీన్ 21.07.06 19.04.07
మాటలబాబు 20.05.07 15.08.07
రాజశేఖర్ 21.06.07 17.10.07
విశ్వనాథ్ 14.07.07 17.10.07
దేవా 17.10.07 27.01.08
చంద్ర కాంత రావు 21.10.07 25.02.08
రవిచంద్ర 22.09.07 20.03.08

[మార్చు] సభ్యులు

తెలుగు వికీపీడియా ప్రస్తుత సభ్యుల సంఖ్య 6,010. ఈనాడు దినపత్రికలో తెలుగు వికీపీడియాను గురించి ప్రచురించిన వ్యాసానికి స్పందించిన పాఠకులు అనేకులు సభ్యత్వం తీసుకోవడం ఒక విశేషం. సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు వ్రాయాలన్న కుతూహలం, పరిమితమైన భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత. సభ్యత్వం లేకున్నా రచనలు, దిద్దుబాట్లు ఎవరైనా చేయవచ్చు. సభ్యులు చేసే దిద్దుబాట్లు గణాంకాలు చూపిస్తూ ఉంటాయి. సభ్యులు చర్చల్లోనూ పాల్గొనవచ్చు, సలహాలు, సహాయం తీసుకోవచ్చు, అందించనూ వచ్చు.

[మార్చు] ఇతర అనుబంధాలు

మెటా-వికీ , కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్, వికీసోర్స్ మొదలైన వి తెలుగు వికీపీడియా అనుబంధాలు.

  • మెటా-వికీ దీనిలో ప్రాజక్టుల కు సంబంధించిన విషయాలు ఉంటాయి.
  • వికీసోర్స్‌లో అత్యంత ప్రాచీనమైనవి, విలువైనవి, సాహిత్య విలువలు కలిగినవి అయిన రచనలను భద్రపరుస్తారు. ఉదాహరణగా శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు భృహత్ ప్రణాలికలను చేపట్టి కొనసాగుస్తుంటారు.
  • కామన్స్ లో తెలుగు వికీపీడియాకు ఉపయోగపడే చిత్రాలు, ఛాయాచిత్రాలను భద్రపరుస్తుంటారు. ఇవి అనేక వ్యాసాలలో ఉపయోగించుకుంటారు.
  • వికీబుక్స్ లో పాఠ్యాంశాలకు సంబంధించిన సమాచారం కలిగిన వ్యాసాలు ఉంటాయి.
  • విక్షనరీ లో తెలుగుపదాలకు అర్ధాలు, బహువచనాలు, ఇతర భాషానువాదాలు మొదలైన వ్యాకరణ వివరాలు ఒక్కొక్క పదానికి ఉంటాయి.
  • వికీకోట్ లో ప్రముఖుల వాఖ్యలు ఉంటాయి.

[మార్చు] రచనాశైలి

తెలుగు వికీపీడియా వాస్తవాలను యదార్ధంగానే వ్రాయాలి. సభ్యుల ఊహలకు ఇక్కడ తావులేదు. సమాచారం, వాస్తవం, నిష్పాక్షికం ప్రధానం. ఇతర వికీపీడియాలనుండి అనువాదాలను సమర్పించ వచ్చు. అనువాదాలకు చక్కని ప్రోత్సాహం ఉంటుంది. చట్టపరమైన ఇబ్బందులు కలిగించని రచనలు మాత్రమే చేయాలి. ఇతరుల రచనలను అనుమతి లేకుండా ప్రచురించకూడదు. రచనలనే కాకుండా, బొమ్మలనూ(చిత్రం), ఛాయా చిత్రాలను అప్ లోడ్ చేయవచ్చు. అవి చట్టపరమైన ఇబ్బందులు కలిగించనవై ఉండాలి. వాటిని వివిధ వ్యాసాలలో వివరణ చిత్రాలుగా వాడుకొనే వీలుంది. రచనలను అనేకంగా తెలుగులోనే చేయాలి. ఇతర భాషాపదాలను వాడటం ప్రోత్సహించరు. అనివార్య కారణాలలో మాత్రమే ఇతరభాషా పదాలను వాడటానికి అనుమతి ఉంటుంది.

[మార్చు] తెలుగు వీకీపీడియా పాఠాలు

కొత్తగా చేరిన సభ్యులకు సహాయంగా సాంకేతిక వివరణలను విధాలను తెలుసుకొనే విధంగా సులభ శైలిలో వివరించిన పాఠాలు సభ్యులందరికి అందుబాటులో ఉంటాయి. మొదటి పేజీలో వీటికి లింకులు ఉంటాయి. లింకుల వెంట పయనిస్తూ రచనలను కొనసాగించవచ్చు. ఉదాహరణగా ఈ క్రింది లింకులు చూడవచ్చు.

[మార్చు] విధానాలు శిక్షలు

సర్వజనీయమైనవి, సమాచార పూరితమైనవి, వాస్తవతను ప్రతిబింబిచేవి అయిన రచనలకు మాత్రమే తెలుగు వీకీపీడియాలో స్థానం. అవాంఛనీయమైన రచనలను నిర్వాహకులు తొలగిస్తూ ఉంటారు. వారికి ఈ విషయంలో విశేష అధికారాలు ఉంటాయి. తొలగించడంతో పాటు సభ్యుల రచనలపై కోతకాలం నిషేధం అమలవుతుంది. దుస్చర్య, అవాంఛనీయమైన రచనలను నియంత్రించడానికి ఈ విధానాలు, శిక్షలు పాటిస్తుంటారు.

[మార్చు] రచ్చబండ

రచ్చబండ ఇది తెలుగు వికీపీడియా సభ్యుల అభిప్రాయవేదిక.ఇక్కడ సభ్యులందరూ,సహాలూ సంప్రదింపులూ,సందేహాలు ఇక్కడ చోటొ చేసుకుంటాయి.తెవీకీ తీసుకురాలసిన మార్పులు చేర్పులూ గురించి ఇక్కడ చర్చిస్తారు.ఇక్కడ సభ్యత్వం ఉన్న వారు లేనివారు సైతం పాల్గొన వచ్చు.

[మార్చు] చర్చలు

ప్రతి పేజీలోను ఒక చర్చాపేజి ఉంటుంది. వ్యాసానికి సంబంధించి ఆ చర్చాపేజీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు రచయిత నుండి సమాధానం పొందవచ్చు. వ్యాసంపై అబిప్రాయం అక్కడ జతచేయవచ్చు. సభ్యుని పేజీలో ఒక చర్చాపేజీ ఉంటుంది దానిలో సభ్యునితో అనేక విషయాలపై చర్చించవచ్చు. అబినందనలు, ప్రశంసలు, నెనర్లు(ధన్యవాదాలు) కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. సభ్యులూ, ఇతరులు ఒకరితో ఒకరు చర్చించుకోవడానికి రచ్చబండ అనే చర్చా వేదిక ఉపయోగపడుతుంది.

[మార్చు] కొత్త సభ్యులను ప్రొత్సహించడం

తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలను, సలహాలను అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మద్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి.

[మార్చు] పతకాలు

తెలుగు వికీపీడియా చేసే కృషికి గుర్తింపుగా సభ్యులు ఒకరికి ఒకరు పతకాలు ప్రధానం చేస్తూ ఉంటారు. దిద్దుబాట్లు గణించి కొన్ని ప్రాజక్టులలో సాధించిన విశేష కృషి ఉపయోగకరమైన విషయాలు సమర్పించినప్పుడు పతకాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు.


[మార్చు] ఇవి కూడా చూడండి

[మార్చు] బయటి లింకులు

[మార్చు] వనరులు, మూలాలు

Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com