తాళ్ళపాక
వికీపీడియా నుండి
తాళ్లపాక, కడప జిల్లా, రాజంపేట మండలానికి చెందిన గ్రామము. కడప - రాజంపేట రహదారిలో రాజంపేటకు సమీపంలో ప్రధాన రహదారి నుండి తూర్పుగా 3 కి.మీ. దూరంలో తాళ్ళపాక గ్రామముంది. కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వరుని 32 వేల కీర్తనలతో ఆరాధించిన పదకవితా పితామహుడు, అన్నమాచార్యుడు తాళ్లపాకలో జన్మించాడు. "చందమామ రావే జాబిల్లి రావే", "అదివో అల్లదివో శ్రీహరివాసము" వంటి పాటలు ఆయన నుండి తెలుగు వారికి దక్కాయి.
క్రీ.శ. 1426వ సంవత్సరం క్రోధి నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున తాళ్లపాకలో అన్నమయ్య జన్మించాడు. తల్లి లక్కమాంబ, తండ్రి నారాయణ సూరి. అన్నమయ్య చిన్నప్పుడే తిరుమల చేరుకున్నాడు. తల్లిదండ్రులు కోరగా తిరిగి తాళ్ళపాకకు వచ్చి వివాహం చేసుకున్నా తిరిగి తిరుమలకు వెళ్ళాడు. ఆయన ఇల్లాలు తిమ్మక్క సుభద్రాపరిణయం రచించింది. తెలుగులో ఆమే తొలి కవయిత్రి. అన్నమయ్య కుమారుడు పెద తిరుమలాచార్యులు కూడా కీర్తనలు రచించాడు.
తాళ్ళపాకలో చెన్నకేశవాలయం, సుదర్శనాలయం ఉన్నాయి. సుదర్శనాలయంలో సుదర్శన చక్రం ప్రతిష్ఠించబడి ఉంది. సుదర్శన చక్రం కాశీలో తప్ప మరెక్కడా లేదు. తాళ్ళపాకలో సిద్ధేశ్వరాలయం కూడా ఉంది. ఈ ఆలయాలు 9, 10 శతాబ్దాల నాటివి. తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1982లో అన్నమయ్య ఆరాధన మందిరాన్ని నిర్మించి ఆ మందిరంలో అన్నమయ్య విగ్రహాన్ని నెలకొల్పారు.
[మార్చు] మూలాలు, వనరులు
కడప జిల్లా విజ్ఞాన విహార దర్శిని - డా. జానమద్ది హనుమచ్ఛాస్త్రి మరియు విద్వాన్ కట్టా నరసింహులు
[మార్చు] చిత్రమాలిక
|
|
---|---|
కూచివారి పల్లె · ఆకెపాడు · అనంతరాజుపురం (నిర్జన గ్రామము) · బహిరాజుపల్లె · బ్రాహ్మణపల్లె · గోపమాంబాపురం · గుండ్లూరు · హెచ్.కొత్తపల్లె · హస్తవరం · కిచ్చమాంబాపురం · మదనగోపాలపురం · మండపల్లె · మన్నూరు · మిట్టమీదపల్లె · పోలి · మందరం · పూలపుత్తూరు · ఆర్.బుడుగుంటపల్లె · రాజంపేట · రోల్లమడుగు · శేషమాంబాపురం · సితారాంపురం · శ్రీరంగరాజాపురం · తాళ్ళపాక · ఊటుకూరు (రాజంపేట మండలం) · బసినాయుడుగారి పల్లి |