తాన్ సేన్
వికీపీడియా నుండి
మియాఁ తాన్ సేన్ (1493 లేదా 1506 – 1586 లేదా 1589), హిందూస్థానీ క్లాసికల్ సంగీత ప్రపంచంలో ఘనమైన చరిత గలవాడు. ప్రముఖ వాగ్గేయకారుడు. మధ్య ఆసియా కు చెందిన రబాబ్ అనే సంగీత వాయిద్యాన్ని తీర్చిదిద్దాడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ నవరత్నాలలో ఒకడు. బాల్యం పేరు 'రమ్తాను పాండే', అక్బర్ ఇతన్ని మియాఁ (మహా పండితుడు) అనే బిరుదునిచ్చి గౌరవించాడు.