See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
చెక్కభజన పాటలు - వికీపీడియా

చెక్కభజన పాటలు

వికీపీడియా నుండి

రాయలసీమ లో - మరీ ముఖ్యంగా కడప, చిత్తూరు జిల్లాల్లో - చెక్కభజన చాలా ప్రాచుర్యం పొందింది. ఇందులో భజనచెయ్యడానికి వాడే చెక్కలు పొడవుగా ఉండే పలకలనుపోలి ఉండడం వల్ల చెక్కభజననే పలకల భజన అని కూడా అంటారు. చేతుల్లో మూరెడు పొడవుండే తాళపుచెక్కలతో, కాళ్ళకు గజ్జెలతో వలయాకారంలో తిరుగుతూ తాళపు చెక్కలు వాయిస్తూ తాళానికి అనుగుణంగా పాటలు పాడుతూ నృత్యం చేస్తూ ఉంటారు. ఒకే చేతిలో రెండు చెక్కలను ఆడిస్తూ వాయించడం చెక్కభజనలోని సొగసు. వలయాకారంలో తిరిగే కళాకారులు కొన్ని సార్లు ఉద్దులు-వెలుద్దులుగా (జతలు జతలుగా) మారి ఎదురెదురుగా అడుగుమార్చి అడుగువేస్తూ ఉద్ది మార్చి ఉద్ది (ఒక అడుగులో ఒకవైపు-ఇంకొక అడుగులో రెండవవైపు) తిరుగుతూ నృత్యం చేస్తారు. పెన్నుద్దికాడైన గురువు పాటలోని ఒక్కొక్క చరణం అందిస్తే మిగిలినవాళ్ళు అందుకుని పాడుతూ నృత్యం చేస్తారు. పలకల భజనలో జడకోపు తప్పనిసరిగా ఉంటుంది. ప్రస్తుతం చెక్కభజనలో భక్తి, పౌరాణిక, శృంగార, హాస్య సంబంధమైన పాటలు వ్యాప్తిలో ఉన్నాయి. ప్రాచీనకాలంలో తిత్తి, మద్దెల, కంజీర వాయిద్యాలుగా ఉండేవి. ఇప్పుడు హార్మోనియం, డోలు, కంజీర, తబలా వాడుతున్నారు. కృష్ణుడు-చెంచిత సంవాదము

కృష్ణుడు:పచ్చనీ నీలాల పారుటాకుల సీరపై నల్ల గందోడి పాపా
ఏవూరిదానవే చెంచితా ఏవూరిదానవే ముత్తెమా  ఏవూరిదానవే పగడమా ఏవూరిదానావే
చెంచిత :ఏవూరులైతే ఏమికృష్ణూడా ఏపల్లెలైతే ఏమికృష్ణూడా 
ఆడవోళ్ళుండేటి సోటూలో నీకు మాటలేముంటాయి కృష్ణూడా
పోవోయి  పోవోయి నల్లన్ని బాబు పొద్దేడబోయేర నా సామి
కృష్ణుడు:పిల్లా బామా మేనత్త కూతుర మేలు కన్నుల దాన జారు పైటా దానా
 కండ్ల కాటుక దాన పండ్ల దాల్చిన దాన   చెంచితా నీవేవూరిదానవే చెంచీతా  
నీ అడుగు చూసి నేను చెంచితా ఆర్నెల్లు కాసుంటి చెంచీతా
నన్ను పెళ్ళాడవే చెంచితా నీ కులముద్దరించేను చెంచీతా
చెంచిత:చీచీ పోరా సిగ్గులేనివాడా 
 హీనంబు లేదురా కృష్ణూడా నీకు మానంబు లేదురా కృష్ణూడా
 నిన్ను సూత్తేను బయమౌర కృష్ణూడా
నువ్వు నల్లంగ వుండావు కృష్ణూడా
 నాకు బయమేసురా కృష్ణూడా దూరంగ వుండార కృష్ణూడా
కృష్ణుడు :నేనెవరానుకున్నావె చెంచితా
నే రేపల్లె వాడాలొ చెంచితా నే గోపెమ్మ కొడుకునే చెంచితా
నే గోపాల కృష్ణుణ్ణే చెంచితా నే మచ్చావ తారుణ్ణె చెంచితా
నన్ను పెళ్ళాడవే చెంచితా నీ కులముద్దరించేను చెంచీతా
చెంచిత:చీచీ పోరా సిగ్గులేనివాడా
 హీనంబు లేదురా కృష్ణూడా నీకు మానంబు లేదురా కృష్ణూడా
నీకు పెళ్ళాలు లేకనే కృష్ణుడా నువ్వు నాకాడికొస్తివ కృష్ణూడా
నువ్వు వచ్చేటి తోవలో కృష్ణూడా నిన్ను పామన్న కరవదా కృష్ణూడా

బృందగేయం (కరుణప్రధానం)

యమునాకళ్యాణిస్వరాలు - చతురస్రగతి ఏకతాళం

మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

చూసొస్చ జానకీ - కోడిపందెము

ఆడ: ముక్కులోటి ముక్కెర

కోడిపుంజుల పాలాయ

పోవద్దు మామా - కోడిపందెమూ

నువు ఆడద్దు మామా - కోడిపందెము

మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడొస్చ జానకీ - కోడిపందెము

ఆడ: సెవుల్లోటి కమ్మలు

కోడిపుంజుల పాలాయ

పోవాకుమగడా - కోడిపందెమూ

నువు ఆడాకు మగడా - కోడిపందెము

మగ: ఆటలేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

పొయొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడొస్చ జానకీ - కోడిపందెము

ఆడ: మెడల్లోటి ఆరాలు

కోడిపుంజుల పాలాయ

పోవద్దు ముద్దురుడ - కోడిపందెమూ

నువు ఆడద్దు ముద్దురుడ - కోడిపందెము

మగ: కోపులేమొ తగ్గినాయి

కొమ్మలేమొ హెచ్చినాయి

ఆడెన్న వస్చానె

కోడిపందెమూ - నేను

గెలిసన్న వస్చానె - కోడిపందెము

ఆడ: నడుం కున్న వడ్డ్యాణం

కోడిపందెం పాలాయ

పోవద్దు నాథుడా - కోడిపందెమూ

నువు ఆడద్దు మగడా - కోడిపందెము

మగ: కోపులేమొ తగ్గినాయి

మోజులేమొ హెచ్చినాయి

చూసొస్చ జానకీ

కోడిపందెమూ - నేను

ఆడెన్న వస్చానె - కోడిపందెము

ఆడ: కాలాలోటి కడియాలన్ని

కోడిపుంజుల పాలాయ

వద్దొద్దు మామా - కోడిపందెమూ

నువు ఆడద్దు మామా - కోడిపందెము

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -