కుంకుడు
వికీపీడియా నుండి
కుంకుడు | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సపిండస్ మార్జినేటస్
|
|||||||||||||
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||
|
|||||||||||||
|
కుంకుడు (Sapindus) ఒక రకమైన వృక్షం. ఇది సపిండేసి కుటుంబానికి చెందిన చెట్టు. దీని నుండి లభించే కుంకుడు కాయల కోసం పెంచుతారు. సపిండస్ ప్రజాతిలోని 13 జాతులలో దక్షిణ భారతదేశంలో సా.లారిఫోలియస్ మరియు సా.ఎమర్జినేటస్ లను మనం ఉపయోగిస్తున్నాము.
[మార్చు] లక్షణాలు
- మధ్యరకంగా పెరిగే వృక్షం.
- ఉపాంతరహిత అగ్రంతో దీర్ఘవృత్తాకార పరకాలున్న సమపిచ్ఛక సంయుక్త పత్రాలు.
- అగ్రస్థ శాఖయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న గోధుమరంగుతో ఉన్న పసుపురంగు పుష్పాలు.
- మూడు నొక్కులు గల టెంకగల ఫలం.
[మార్చు] ఉపయోగాలు
- కుంకుడు కాయల్ని దంచి వేడి నీటిలో కషాయాన్ని తయారుచేసి తలస్నానం కోసం సబ్బు క్రింద ఉపయోగిస్తారు. వీటిలోని సెపోనిన్ వలన నురుగ తయారై తలపైనున్న మలినాలు తొలగిపోయి వెంట్రుకలు శుభ్రపడతాయి. ఈ రసం సూక్ష్మక్రిమి సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలు ఉంటే దీనిని వాడడం ఇంకా మంచిది.
- కుంకుడు గింజల నుండి లభించే నూనె కీటక సంహారిణిగా పనిచేస్తుంది.
- కుంకుడు కర్ర పసుపు రంగులో చేవకలిగి కలపగా ఉపయోగపడుతుంది.
- పట్టు మరియు సిల్క్ చీరలను శుభ్రపరచటానికి కుంకుడు రసం ఎంతో మేలైనది.
- తలనొప్పికి కుంకుడు ఆకులను మెత్తగా నూరి నూనెతో వేయించి గోరువెచ్చగా తలకు పట్టీ క్రింద వేస్తే ఎంతో ఉపశమనం కలుగుతుంది.
[మార్చు] బయటి లింకులు
- Maggie's Soap NutsTM, the laundry soap that Grows on TreesTM! Free information at Maggie's Pure Land:
- Pureindia: Company involved in sustained harvesting , processing and exports of soapnuts:
- Flora of Pakistan: Sapindus
- Flora of China: Sapindus species list
- :Organic Laundry Soap Nuts available at "New Hampshire All Natural"
- :Simply Soap Nuts available at "www.stopforbreath.co.uk." Great prices. Lots of info.