కీ బోర్డు
వికీపీడియా నుండి
తెలుగు కీ బోర్డు
తెలుగు కీ బోర్దులలో రకాలు
తెలుగు అక్షరాల కీ బోర్డు
దీనిలో ఇంగ్లీషు QWERTY కీ బోర్డు లో ఒక్కొక్క కీ (మీట) కి తెలుగు అక్షరము జత చేయబడివుంటుంది.
ఉదాహరణకి k అక్షరము క తో జతచేయబడివుంటే
క అని రాయటానికి k నొక్కాలి.
ఖ అని రాయటానికి K నొక్కాలి
ఉపయోగము
దీని ద్వారా తెలుగు త్వరగా టైపు చేయవచ్చు. అయితే నేర్చుకోవడము, ఒకే వ్యాసములో ఇంగ్లీషు వాడాలంటె కష్టము.
రకాలు
ఇంగ్లీషు (రోమన్) అక్షరాలతో తెలుగు రాయుటకు కీ బోర్డు
దీనిలో ఒకటి లేక ఎక్కువ ఇంగ్లీషు అక్షరాల సమూహానికి ఒక తెలుగు అక్ష్రరము జత చేయబడుతుంది. అ ఇంగ్లీషు అక్షరాల సమూహము నొక్కినపుడు ప్రత్యేక సాప్టువేరు సహయంతో తెలుగు అక్షరాల కోడ్ కి మార్చబడి బద్రపడచబడుతుంది. ఉదాహరణకి
క అని రాయటానికి ka నొక్కాలి.
ఖ అని రాయటానికి kha లేక Ka నొక్కాలి
ఉపయోగము
ఇది ఇంగ్లీషు తెలిసినవారు కొద్ది పాటి సమయములో నేర్చుకోవచ్చు. ఒకే వ్యాసములో ఇంగ్లీషు కూడా వాడవలసినపుడు కీ బోర్డు మారదు కాబట్టి సులభము గా వుంటుంది. ఏ కంప్యూటర్ లో నైనా ఇంటర్ నెట్ లో స్క్రిప్టు ద్వారా దీనిని వాడుకోవచ్చు. వికిపీడియా లో తెలుగు వ్యాసాలు రాయటానికి కూడా వాడుతున్నారు.
రకాలు
సంకర (ఊహానుగత) కీ బోర్డు
దీనిలో మిగతా రెండు రకాల కీ బోర్డుల మంచి లక్షణాలు కలిసి వున్నాయి.
ఉపయోగము
ఇది ఇంగ్లీషు తెలిసినవారు కొద్ది పాటి సమయములో నేర్చుకోవచ్చు.
రకాలు