కరణం మల్లేశ్వరి
వికీపీడియా నుండి
కరణం మల్లేశ్వరి తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి. శ్రీకాకుళంకు చెందిన ఈమె బరువులు ఎత్తడం ఆటలో ఒలింపిక్ పతకం సాధించి ప్రసిద్ధురాలయ్యింది. ఈమె 1975 జూన్ 1 న జన్మించింది.
సిడ్నీలో జరిగిన 2000 ఒలింపిక్ క్రీడలలో వెయిట్ లిఫ్టింగ్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఆ విధంగా ఒలింపిక్ ఆటలలో పతకం సాధించిన మొదటి భారతీయ మహిళ అయ్యింది, మరియు మూడవ భారతీయ వ్యక్తి. (అంతకుముందు పతకాలు సాధించిన భారతీయులు - 1952 హెల్సింకీ లో bantamweightwrestler ఖషబా జాదవ్, మరియు 1996 అట్లాంటాలో టెన్నిస్ క్రీడాకారుడు లియాండర్ పేస్)
[మార్చు] పతకాలు, పురస్కారాలు
- 2000 ఒలింపిక్స్ - కాంస్య పతకం - 69 కిలోగ్రాముల విభాగంలో
- 1994 - ఇస్తాంబుల్ ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలు - బంగారు పతకం
- 1995 - పూసాన్, కొరియా - ఆసియా ఛాంపియన్షిప్ పోటీలు
- 1995 - ఘుంగ్జౌ, చైనా - 54 కిలోల విభాగంలో మూడు బంగారు పతకాలు
- భారత ప్రభుత్వం అర్జున అవార్డు
- 1995 - రాజీవ్ గాంధీ ఖేల్ రత్న బహుమతి
- 1999- పద్మశ్రీ
ఒక సందర్భంలో ఆమె ఇలా అంది -
- భారత దేశానికి పతకాలు ఎందుకు రావని అడుగుతుంటారు. అది ఎయిర్-కండిషన్డ్ గదులలో కూర్చుని మాట్లాడినంత సులభం కాదు. ఆ ప్రయత్నంలో ఉన్న శ్రమ, వేదన మాకు తెలుస్తాయి...