కజ్జికాయ
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
కొబ్బరిని కోరి దానికి బెల్లపుపాకమును చేర్చిన మిశ్రమమును ఉండలుగాచేసి ఉంచుతారు. తరువాత గోదుమ పిండిని మెత్తగా నీళ్ళతో కలపి,బాగుగా పిసికి చిన్న చిన్న ఉండలుగా చేసి వాటిని గుండ్రముగా ఉత్తరాదిన చేయబడే పరోటా మాదిరిగా చేస్తారు. గుండ్రముగా ఉండే దాని మధ్య ముమ్దుగా సిద్దము చేసుకొన్న కొబ్బరి కోరు ఉంచి ఉంచి రెండు వైపులా సగానికి మడిచి కొబ్బరికోరు బయటకు రాకుండా అంచులను మూసివేస్తారు. అలా చేయబడ్డ అర్ధ చంద్రాకారపు కజ్జికాయలను బాగ మరిగే నూనెలో మంచి బంగారపు రంగు వచ్చేవరకూ వేయిస్తారు. అలా తయారయిన వంటకాన్ని కజ్జికాయ అని పిలుస్తారు. ఇది కోస్తా ఆంధ్రప్రాంతములో విస్తారముగా లభ్యమగును. ప్రస్తుతం ప్రతి మిఠాయి దుకాణంలోనూ దొరకుతున్నవి.
[మార్చు] రకాలు
- కోవా కజ్జికాయలు