ఉర్సు
వికీపీడియా నుండి
ఉర్సు లేదా ఉరుసు లేదా ఉర్స్ (ఆంగ్లం : Urs) (ఉర్దూ: عرس ) సూఫీ సంతుడి లేదా ఔలియా వారి వర్థంతి సందర్భంగా జరుపుకునే ఉత్సవం. ప్రధానంగా దర్గాహ్ లలో జరుపుకుంటారు. ఉదాహరణకు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి వారి ఉర్స్. ఈ సాంప్రదాయం ప్రధానంగా దక్షిణాసియా ముస్లింలలో కానవస్తుంది. ఈ ఔలియాల 'విసాల్' (అల్లాహ్ తో చేరడం) ఉర్స్ లేదా కళ్యాణం అని భావిస్తారు.
ఉర్స్ అనే పదానికి మూలం అరబ్బీ పదం, దీని అర్థం 'పెళ్ళి' లేదా 'ఉక్ద్' లేదా 'నికాహ్' అనే అర్థం వస్తుంది.
ఈ ఉర్స్ కార్యక్రమాలలో ప్రధాన ఆకర్షణ ఖవ్వాలీ కార్యక్రమం. దీనినే సమాక్వాని అనీ వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఆయా దర్గాహ్ ల సజ్జాద-నషీన్ లు వ్యవహరిస్తారు.
[మార్చు] ఇవీ చూడండి
- సూఫీ తత్వము
- ఉర్స్ (అజ్మీరు)
- దర్గాహ్
- ఔలియా
[మార్చు] బయటి లింకులు
- A Wedding with the Divine, by Yousuf Saeed
- Urs Ajmer Sharif