ఉర్కొండపేట
వికీపీడియా నుండి
ఉర్కొండపేట, మహబూబ్ నగర్ జిల్లా, మిడ్జిల్ మండలానికి చెందిన గ్రామము .
[మార్చు] ఊర్కొండపేట ఆంజనేయస్వామి దేవాలయము
ఊర్కొండపేట లో వేలసిన ఆంజనేయస్వామి దేవాలయము అతి పురాతనమైనది,రోగాలనుండి ఉపషమనం కలిగించు దేవాలయంగా ప్రసిద్ది చెందింది.ఈ ఆలయమునకు రెండువైపులా రెండు ఎత్తైన కొండలు ఉండుటచే వాటికి ఊరుకొండలు (పెద్దకొండలు) అని పిలిచెడివారు.ఆ కొండల మధ్యలఓ వెలసిన గ్రామమే ఊరుకొండ పేట. భోజరాయపల్లి కి అతి సమీపంలో ఆనాడు అమ్మపల్లి అనే గ్రామము ఉండెడిది.ఆ రెండు గ్రామాల ప్రజలు ఏదో విషయమై తగాదా పడి వారి గ్రామమును వీరు,వీరీ గ్రామమును వారు తగులపెట్టుకొనడం తో భోజ రాయలు గ్రామము ఖాళీ చేయించి గట్ల నడుమ ఇప్పచెట్ల లో నూతన గ్రామము నిర్మింపచేసాడు.అదే నేటి గట్టు ఇప్పలపల్లి.భోజరాయలు శివోపాసకులు అయినందున గట్టు ఇప్పల పల్లి లో కాళికాదేవి తో పాటు పంచలింగాలను ప్రతిష్టించారు.గ్రామము నందు ఆంజనేయస్వామి విగ్రహము ప్రతిష్టించతలచి తగిన శిలకై వెదుకుతూ వచ్చి ఇక్కడ ఊరుకొండపేట పై శిలను కనుగొన్నారు.ఆంజనేయ స్వామి విగ్రహమును మలచి తరలించుచుండగా స్వామి వారు భోజరఅయలుకు కలలో కనిపించి నన్ను ఇక్కడే ప్రతిష్టించమని ఆదేశించగా అతడు ఆ విగ్రహాన్ని అక్కడే నిలిపాడు.ఆ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు స్వామివారికి ఆలయం కట్టించారని ఇతిహాసము. ప్రతి సంవత్సరము పుష్య బహుళ ద్వాదశి కి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు 8 రోజుల పాటు జరుగుతాయి.
|
|
---|---|
భైరంపల్లి · కొత్తపల్లి · చిలువేరు · వాస్పుల · చేదుగట్టు · కంచన్‌పల్లి · దోనూర్ · సింగందొడ్డి · మాసిగుండ్లపల్లి · వేముల · జగ్బోయినపల్లి · రాంరెడ్డిపల్లి · బొమ్మరాసిపల్లి · జకణాలపల్లి · ఇప్పాయిపహాడ్ · ఉర్కొండపేట · నర్సంపల్లి · ఉర్కొండ · రేవళ్ళి · బోయినపల్లి · మిడ్జిల్ · వడియాల్ · మున్ననూర్ · వెలుగొమ్ముల · కొత్తూర్ · గుడిగాన్‌పల్లి · మాదారం · రాచలపల్లి |