ఈము
వికీపీడియా నుండి
ఈ వ్యాసము మొలక. ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. |
ఈము మూస:StatusLeastConcern
|
|||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||
|
|||||||||||||||
|
|||||||||||||||
Dromaius novaehollandiae (Latham, 1790) |
|||||||||||||||
The Emu has been recorded in the areas shown in orange.
|
|||||||||||||||
|
|||||||||||||||
Synonyms | |||||||||||||||
Dromiceius novaehollandiae |
ఈము (Emu) ఒకరకమైన ఎగురలేని పక్షులు. ఇవి డ్రోమియస్ ప్రజాతికి చెందినవి. ఇది ఆస్ట్రేలియా దేశపు జాతీయ పక్షి. ఇవి ఇసుక తిన్నెలపై లేదా అడవులలో జీవిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద పక్షి. ఇవి ఏక సంయోగిక పక్షులు.
ఈము పక్షులకు చిన్న తల, పొడుగాటి మెడ, శరీరంపై దట్టంగా ఈకలు ఉంటాయి. ఇవి పొడుగాటి కాళ్ళతో 6 అడుగుల ఎత్తు, 45-50 కి.గ్రా. బరువుంటాయి. ఇవి 25-30 సంవత్సరాలు జీవిస్తాయి మరియు శాఖాహారులు. ఇవి చాలా వేగంగా పరుగెత్తగలవు. వీటిని మాంసం, నూనె మరియు చర్మం కోసం మనదేశంలో కూడా పెంచుతున్నారు.
[మార్చు] ఉపయోగాలు
- ఈము పక్షుల కొవ్వు నుండి ఖరీదైన నూనె తయారుచేస్తారు. ఇది కీళ్ళనొప్పులు, చర్మవ్యాధుల నివారణలో, ఔషధాల తయారీలో ఉపయోగపడుతుంది.
- ఈము మాంసంలో కొలెస్టరాల్ తక్కువగా ఉంటుంది.
- ఈము చర్మంతో దుస్తులు, చేతి సంచులు, బూట్లు తయారుచేస్తారు.