ఇంద్రజ
వికీపీడియా నుండి
ఇంద్రజ గా తెలుగు సినీ రంగములో పేరుతెచ్చుకొన్న రజతి తెలుగు, మళయాల సినిమా నటి. ఈమె ఒక తెలుగు కుటుంబములో కేరళలో పుట్టి, మద్రాసులో పెరిగినది. ఈమె దాదాపు 80కి పైగా సినిమాలలో నటించింది.
కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా. ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి మరియు శోభ ఈమె చెల్లెళ్లు.
పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత మరియు నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించినది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చినది.
ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించినది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో పనిచేసింది. గుణశేఖర్ తీసిన సొగసు చూడతరమా సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మళయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.
ఈమె 2005లో జయా టీవీలో శాస్త్రీయ నృత్యంపై ఆధారితమైన గేంషో తకదిమిథ కు యాంకరుగా కూడా పనిచేసింది.
[మార్చు] చిత్రమాలిక
- చిన్ని చిన్ని ఆశ
- ఎర్రోడు
- సొగసు చూడతరమా
- లవ్ గేమ్
- ఒక చిన్నమాట
- జై భజరంగభళీ
- జంతర్ మంతర్
- వన్స్ మోర్
- యమలీల
- పిచ్చోడి చేతిలో రాయి
- పిట్టల దొర
- పెద్దన్నయ్య
- తెలంగాణ
- నల్లపూసలు
- అమ్మదొంగా (ప్రత్యేక నృత్యం)
- సంప్రదాయం
- జగదేక వీరుడు
[మార్చు] బయటి లింకులు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఇంద్రజ పేజీ