అలాన్ ట్యూరింగ్
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
అలాన్ ట్యూరింగ్ | |
---|---|
జననం | 06-23-1912 లండన్, ఇంగ్లండ్ |
మరణం | జూన్ 7, 1954 విల్మ్సలో, ఇంగ్లండ్ |
వృత్తి | గణితశాస్త్రజ్ఞుడు, Logician, Cryptographer |
భార్య/భర్త | లేరు |
తల్లితండ్రులు | జూలియస్ మాథిసన్ ట్యూరింగ్, ఎథెల్ స్టోనీ ట్యూరింగ్ |
ఏలన్ మేథిసన్ టూరింగ్ ను కంప్యూటర్ సైన్స్ కు తండ్రిగా పిలువబడతాడు. ట్యూరింగ్ యంత్రము తో అల్గోరిథమ్ అనే భావనకు ప్రభావాత్మకమైన రూపాన్ని తీసుకువచాడు. ఏ కంప్యూటర్ నమూనా ను తీసుకున్నా దానిని టూరింగ్ యంత్రముగా కాని , దాని సామర్థ్యము గల ఉపసమితిగా గాని వ్యక్తపరచవచ్చును.
ఒక యంత్రము ఆలోచించగలుగుతుందా, దానికి చేతన రాగలుగుతుందా అని టూరింగ్ పరీక్ష తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు , ముఖ్యమైన వాదనను చేర్చాడు.
ఆ తరువాత ఇంగ్లండులో నేషనల్ ఫిజికల్ లేబొరెటరీ లో చేరి, ప్రోగ్రామ్ ను గుర్తు ఉంచుకునే కంప్యూటర్ (ఈనాటి కంప్యూటర్) కు మొదటి రూపకల్పన చేశాడు. 1947లో యూనివర్శిటీ అఫ్ మాంచెస్టర్ లో చేరి సాఫ్ట్‌వేర్ మీద పనిచేస్తూ , మాంచెస్టర్ మార్క్ I, అప్పటిలో ప్రపంచములో మొదటి నిజమైన కంప్యూటర్ ను తయారు చేశాడు
రెండవ ప్రపంచ యుద్దము లో టూరింగ్ బ్రిటన్ కు చెందిన కోడ్ బ్రేకింగ్ సెంటర్ లో చేరి, జర్మన్ ఎనిగ్మా యంత్రానికి దీటైన జవాబు కనుక్కున్నాడు.
1952 లో , టూరింగ్ ఒక పురుషుని తో లైంగిక సంబంధము పెట్టుకోవడము వలన "అసభ్య ప్రవర్తన", అనే నేరం ఋజువైంది. అతనిని ప్రొబేషన్ లో పెట్టి, హార్మోన్ థెరపీ తీసుకోమని అదేశించారు. 1954 లో ఒక ఆపిల్ లో సైనైడ్ ను పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
[మార్చు] ఆసక్తికరమైన విషయములు
టూరింగ్ 1911 లో భారతదేశములో జన్మించాడు. ఆతని తండ్రి అప్పటి ఇండియన్ సివిల్ సర్వీస్ లో పని చేసేవాడు.