విన్‌స్టన్ బెంజిమన్
వికీపీడియా నుండి
1964, డిసెంబర్ 31న జన్మించిన విన్‌స్టన్ బెంజమిన్ (Winston Benjamin) వెస్టీండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 21 టెస్టు మ్యాచ్‌లకు మరియు 85 వన్డే మ్యాచ్‌లకు ఇతడు వెస్టీండీస్ తరఫున ప్రాతినిధ్యం వహించినాడు. బెంజమిన్ తన తొలి టెస్టును 1987-88లో భారత్ పై ఢిల్లీలో ఆడినాడు.
విషయ సూచిక |
[మార్చు] టెస్ట్ క్రికెట్
బెంజిమన్ 1987-88లో తొలిసారిగా భారత్ పై ఢిల్లీలో టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేశాడు. 8 టెస్టులు ఆడిన తరువాత 1993 వరకు జట్టులో స్థానం దక్కలేదు. రెండు సంవత్సరాలు ఆడిన తరువాత మళ్ళీ 1994-95లో ఆస్ట్రేలియా పర్యటన తరువాత ఉధ్వాసనకు గురైనాడు. మొత్తం 21 టెస్టు మ్యాచ్‌లు ఆడి 470 పరుగులు, 61 వికెట్లు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు 85 పరుగులు. టెస్ట్ బౌలింగ్‌లో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 46 పరుగులకు 4 వికెట్లు.
[మార్చు] వన్డే క్రికెట్
బంజిమన్ మొత్తం 85 వన్డేలలో ప్రాతినిద్యం వహించి 298 పరుగులు, 100 వికెట్లు సాధించాడు. వన్డేలలో అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 5 వికెట్లు.
[మార్చు] ప్రపంచ కప్ క్రికెట్
బెంజిమన్ 1987 మరియు 1992 ప్రపంచ కప్ క్రికెట్‌లో వెస్ట్‌ఇండీస్ జట్టుకు ప్రాతినిద్యం వహించాడు.
[మార్చు] కోచ్‌గా
క్రీడాజీవితం అత్యున్నత దశ తరువాత కోచ్‌గా కొత్త అవతారం ఎత్తి లీవార్డ్ ఐలాండ్ జట్టుకు కోచ్‌గా కొద్దికాలం వ్యవహరించాడు. కాని 2005 జూన్ లో తొలిగించబడ్డాడు.[1]
[మార్చు] మూలాలు
|
|
---|---|
వివియన్ రిచర్డ్స్ (కెప్టెన్) · ఎల్డిన్ బాప్టిస్ట్ · విన్‌స్టన్ బెంజమిన్ · కార్లిస్తే బెస్ట్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్) · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · గస్ లోగీ · పాట్రిక్ ప్యాటర్సన్ · రిచీ రిచర్డ్సన్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ |
|
|
---|---|
రిచర్డ్సన్ (కెప్టెన్) · కర్ట్లీ ఆంబ్రోస్ · కీత్ ఆథర్టన్ · విన్‌స్టన్ బెంజిమన్ · ఆండర్సన్ కమ్మిన్స్ · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · బ్రియాన్ లారా · గస్ లోగీ · మాల్కం మార్షల్ · పాట్రిక్ పాటర్సన్ · ఫిల్ సిమ్మన్స్ · డేవిడ్ విలియమ్స్ (వికెట్ కీపర్) |