రిచీ రిచర్డ్‌సన్
వికీపీడియా నుండి
వెస్టిండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడైన రిచీ రిచర్డ్‌సన్ (Richard Benjamin Richardson) 1962, జనవరి 12న ఆంటిగ్వాలో జన్మించాడు. ఇతడు వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు నాయకత్వం కూడా వహించాడు. 1983-84లో భారతపర్యటన సమయంలో క్లైవ్ లాయిడ్ నాయకత్వంలో తొలిసారిగా టెస్ట్ క్రికెట్ లో ప్రవేశించినాడు. వివియన్ రిచర్డ్స్ తర్వాత వెస్టిండీన్ క్రికెట్ జట్టుకు నాయకత్వ బాధ్యతలు చేపట్టినాడు. 24 టెస్టులకు కెప్టెన్‌గా వ్య్వహరించి 11 టెస్టులను గెలిపించాడు. నాలుగేళ్ళ అతని నాయకత్వ సమయంలో వెస్టిండీస్ ఒకే ఒక్క సీరీస్ 1995లో ఆస్ట్రేలియాతో ఒడిపోయింది. బ్రియాన్ లారా ఇతని సమయంలోనే ప్రపంచ శ్రేణి బ్యాట్స్‌మెన్‌గా అవతరించినాడు.
రిచర్డ్‌సన్ 86 టెస్టులు ఆడి 44.39 సగటుతో 5949 పరుగులు సాధించాడు. 16 సెంచరీలు, 27 అర్థ సెంచరీలు నమోదుచేశాడు. అందులో ఆస్ట్రేలియా పైనే 9 సెంచరీలు సాధించాడు. టెస్టులలో అతని అత్యధిక స్కోరు 194 పరుగులు 1989లో గుయానాలో భారతజట్టుపై సాధించాడు.
వన్డేలలో 224 మ్యాచ్‌లు ఆడి 33.41 సగటుతో 6248 పరుగులు చేసినాడు. ఇందులో 5 సెంచరీలు, 44 అర్థ సెంచరీలు సాధించాడు. వన్డేలలో అతని అత్యధిక స్కోరు 122 పరుగులు. రిచర్డ్‌సన్ 1987, 1992 మరియు 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో కూడా పాల్గొన్నాడు.
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
వివియన్ రిచర్డ్స్ (కెప్టెన్) · ఎల్డిన్ బాప్టిస్ట్ · విన్స్టన్ బెంజమిన్ · కార్లిస్తే బెస్ట్ · జెఫ్ డుజాన్ (వికెట్ కీపర్) · రోజర్ హార్పర్ · డెస్మండ్ హేన్స్ · కార్ల్ హూపర్ · గస్ లోగీ · పాట్రిక్ ప్యాటర్సన్ · రిచీ రిచర్డ్‌సన్ · ఫిల్ సిమ్మన్స్ · కోర్ట్నీ వాల్ష్ |