తాడేపల్లిగూడెం
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
?తాడేపల్లిగూడెం మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
ముఖ్య పట్టణము | తాడేపల్లిగూడెం |
జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
గ్రామాలు | 17 |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
183,401 (2001) • 91896 • 91505 • 70.34 • 74.12 • 66.54 |
అక్షాంశరేఖాంశాలు:
తాడేపల్లిగూడెం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము మరియు చిన్న పట్టణము. ఇది జిల్లాలో ఒక ముఖ్య వాణిజ్య కేంద్రము.
విషయ సూచిక |
[మార్చు] తాడేపల్లిగూడెం పట్టణం
ఆంధ్ర ప్రదేశ్ మునిసిపాలిటీలలో తాడేపల్లిగూడెం ఒకటి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఇది ఒకటి. జిల్లా ముఖ్య పట్టణం అయిన ఏలూరుకి 50 కి.మీ.ల దూరంలో ఉన్న ఈ పట్టణాన్ని ఆనుకుని అనేక పల్లెటూళ్ళు ఉన్నాయి మరియు ఇతర ముఖ్యపట్టణములకు దగ్గరగా జిల్లాకు నడిబొడ్డున వున్నది. కోస్తాలో ముఖ్యపట్టణమైన విజయవాడకు 100 కి.మీల దూరంలో వున్నది. రాజమండ్రికి 45 కి.మీల దూరంలో వున్నది.
2001 జనభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా వివరాలు
- మొత్తం జనాభా 102,303
- మగవారు 49%
- ఆడవారు 51%
- సగటు అక్షరాస్యత శాతం 61%.
[మార్చు] వ్యాపారం
తాడేపల్లిగూడెం వ్యవసాయోత్పత్తుల అమ్మకాలు నిర్వహించే కేంద్రంగా కోస్తా జిల్లాలలో పేరుగాంచింది. బెల్లం, పప్పు దినుసుల వ్యాపారానికి మిక్కిలి ప్రసిద్ధి చెందింది. వ్యవసాయ ఉత్పత్తులు నిలవ ఉంచే గిడ్డంగులకు కూడా ఈ పట్టణం గుర్తింపు పొందింది. రాష్ట్రంలోనే అతి పెద్ద ధాన్యం నిలువ చేసే ఎఫ్.సీ.ఐ. గిడ్డంగులు ఈ పట్టణంలో ఉన్నాయి. ఇక్కడి నుండి దేశంలోని పలు ప్రాంతాలకు ఉల్లిపాయలు ఏగుమతి చేయబడుచున్నవి.
- మామిడి మార్కెట్
వేసవి సీజన్ వచ్చిందంటే తాడేపల్లిగూడేం కళకళలాడుతుంటుంది. జిల్లాలోనే అతిపెద్ద మామిడి కాయల మార్కెట్ పిప్పర వెళ్ళే మార్గంలో కలదు. రిటైలర్స్,హోల్ సేలర్స్, మరియు సామాన్య ప్రజల కొనుగోళ్ళతోనూ అతిరద్దీగా ఉండే మార్కెట్.
[మార్చు] పరిశ్రమలు
పట్టణంలో గొయంకా వారి ఫుడ్ ఫ్యట్స్ ఫెర్టిలైజర్స్(3 ఏఫ్) కర్మాగారము మరియ చాక్ పీసుల తయారీ, కొవ్వత్తుల తయారీ పరిశ్రమలు ఉన్నవి. పట్టణానికి దగ్గరగా బెల్లం తయారీ కేంద్రాలు ఉన్నవి. పట్టణములో 6000 పైగా రవాణా వాహనములు వున్నవి. జిల్లాలో ఉన్న బియ్యపు మిల్లులలో తాడేపల్లిగూడెంలోనే అత్యధిక బియ్యపు మిల్లులు కలవు.
[మార్చు] విశేషాలు
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటీషు వారు యుద్ధ విమానాలను నిలిపేందుకు అణువుగా తాడేపల్లిగూడెంలో 2 కి.మీ పొడవున్న రన్ వేను నిర్మించారు. దీన్ని ప్రస్తుతం ఎవరూ వాడనప్పటికీ ఈ నాటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఈ మార్గం గుండా ప్రసిద్దిపొందిన మిలటరీ మాధవవరం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రన్వే వలన చుట్టు ప్రక్కల భూములు ఒకప్పుడు అభివృద్ది చెందకున్నప్పటికీ ప్రస్తుతం జిల్లాలోనే ప్రఖ్యాతినోందిన నాలుగయిదు {ఈస్ట్ కోస్ట్ హైబ్రీడ్స్, ఎస్.ఆర్.కె.నర్సరీ లాంటి} పెద్ద నర్సరీలు కలవు.
[మార్చు] విద్య
ఇక్కడ మూడు ఇంజనీరింగ్ కాలేజిలు, రెండు ఎం.బి.ఎ కాలేజిలు, రెండు ఎం.సి.ఎ కాలేజిలు ఉన్నాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం యొక్క అనుబంధ క్యాంపస్, డిగ్రీ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి. త్వరలోనే ఉద్యానవనశాఖా (హార్టీకల్చర్) విశ్వవిద్యాలయము ప్రారంభమౌతున్నది.
[మార్చు] ప్రముఖ వ్యక్తులు
- ఈ పట్టణం నుండి అనేక ప్రసిద్ద కళాకారులు జన్మించి ఖ్యాతి నొందారు. సుప్రసిద్ద తెలుగు సినీ హాస్యనటుడు రేలంగి వెంకటేశ్వరరావు అత్తవారి ఊరు. ఇప్పటికీ ఆయన పేరు మీద "రేలంగి" అని ఒక సినిమా థియేటర్ ఈ పట్టణంలో ఉన్నది. ఈ థియేటర్ ఆయన నిర్మించిందే.
- పద్మశ్రీ గ్రహీత అయిన చిత్ర కారుడు, శిల్పి, తాడేపల్లి వెంకన్న ఇక్కడి వారే.
- 48 గంటలు నిర్విరామంగా కూచిపూడి నాట్యం చేసి గిన్నీస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న కిళ్ళాడి సత్యం ఇక్కడి వారే.
- ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు కృష్ణవంశీ తన బాల్యం తాడేపల్లిగూడెంలోనే గడిపాడు.
- ఆంధ్ర్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతిగా పనిచేసిన పసల సూర్యచంద్రరావు
[మార్చు] రవాణా
ఈ పట్టణం దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో రైలు మరియు రోడ్డు మార్గాలతో కలుపబడినది. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ చెన్నై-కోల్కత్తా రైలు మార్గములో ఉంది. జాతీయ రహదారి "ఎన్.హెచ్-5" ఈ పట్టణం నడిబొడ్డు గుండా వెళుతుంది.
[మార్చు] గ్రామాలు
- అప్పారావుపేట
- అరుగొలను
- ఆరుళ్ల
- చినతాడేపల్లి
- జగన్నాధపురం
- జగ్గన్నపేట
- కడియద్ద
- కొమ్ముగూడెం
- కొండ్రుప్రోలు
- కృష్ణయ్యపాలెం
- కూనవరం (నిర్జన గ్రామము)
- కుంచనపల్లె
- మిలిటరి మాధవరం
- మారంపల్లి
- నందమూరు
- నవాబుపాలెం
- నీలాద్రిపురం
- పడాల
- రామన్నగూడెం
- పెదతాడేపల్లి
- వీరంపాలెం
- వెంకట్రామన్నగూడెం
- క్రిష్ణా పురం
|
|
---|---|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |