భీమవరం
వికీపీడియా నుండి
?భీమవరం మండలం పశ్చిమ గోదావరి • ఆంధ్ర ప్రదేశ్ |
|
|
|
|
|
|
|
అక్షాంశరేఖాంశాలు: | |
టైం జోన్ | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
• 5 మీ (16 అడుగులు) |
జిల్లా(లు) | పశ్చిమ గోదావరి |
జనాభా • మగ • ఆడ • అక్షరాశ్యత శాతం • మగ • ఆడ |
219,212 (2001) • 110880 • 108332 • 78.32 • 82.99 • 73.55 |
కోడులు • వాహనం |
• AP 37 |
వెబ్‌సైటు: http://www.bhimavaraminfo.com |
అక్షాంశరేఖాంశాలు:
భీమవర౦, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లా లోని ప్రముఖ పట్టణము మరియు అదే పేరుగల ఒక మండలము.పంచారామాల్లో ఒకటైన భీమారామం భీమవరంలోనిదే. చంద్రునిచే ప్రతిష్టించబడిన లింగము కనుక సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు.ఇది చంద్రశిల అగుటచే పొర్ణమికి తెల్లగానూ అమావాస్యకు గోదుమ వర్ణంలోకి మారుతుంది.
విషయ సూచిక |
[మార్చు] భీమవరం చరిత్ర
పంచారామములలొ ఒకటైన ఈ భీమవరం సోమేశ్వర స్వామి క్షేత్రం. తూర్పు చాళుక్య రాజైన భీమ క్రీ.శ. 890-918 సంవత్సరాల మధ్య ఇక్కడ సోమేశ్వర దేవాలయానికి శంకుస్థాపన చేశాడు.ఈ దేవాలయం ఇప్పుడు గునుపూడి లొ ఉన్నది. తూర్పు చాళుక్య రాజైన భీమ పేరు మీద ఈ పట్టణం భీమవరం అని పేరు వచ్చింది. క్రీ.శ.1120-1130 సంవత్సరాల మధ్య ప్రక్కను ఉన్న విస్సాకోడేరు,ఉండి,పెద్దఅమిరమ్ గ్రామాలకు రహదారి ఏర్పడింది.
[మార్చు] మావుళ్ళమ్మ దేవస్థానం
భీమవరం పట్టణానికే తలమానికంగా వెలుగొందే దేవాలయం మావుళ్ళమ్మ గుడి. నగర నడిబొడ్డున కొలువు తీరిన మావుళ్ళమ్మ దేవస్థాన ఆదాయం పశ్శిమ గోదావరి జిల్ల లో ఏ ఇతర గ్రామ దేవతల దేవాలయాలకూ లేనంత ఉంటుంది. ప్రతి సంవత్సరం కేవలం ఉత్సవాల కొరకు విద్యుత్ చార్జీలే లక్షలు చెల్లిస్తారు. దేవస్థాన ఆవరణలో కల కొటికలపూడి గోవిందరావు కళా వేదికపై సినీ నటులచే పలు ప్రదర్శనలు, ప్రఖ్యాత నటీనటులకు సన్మానాలు చేస్తారు.
[మార్చు] భీమారామం
- ప్రధాన వ్యాసం: భీమారామము
భీమవరంలోని సోమేశ్వరస్వామి దేవాలయం (భీమారామం) పంచారామాలలో ఒకటి. ఈ భీమారామము భీమవరమునకు రెండుకిలోమీటర్లదూరంలో గునుపూడిలో కలదు. ఇక్కడిలింగమును చంద్రుడు ప్రతిష్ఠించాడని స్థలపురాణంలో చెప్పబడుతుంది. చంద్రుని పేరున దీనిని సోమేశ్వరక్షేత్రమని పిలుస్తారు. ఇక్కడ ప్రతీ కార్తీకమాసంలో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతాయి.
శ్వేతవర్ణంలో కనిపించే ఈ లింగము కృమ క్రమముగా అమావాస్య వచ్చే సరికి భూడిద లేదా గోదుమ వర్ణమునకు మారిపోతుంది తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యదాతధంగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ దేవాలయంలోని లింగము చంద్రునిచే ప్రతిష్టించిన చంద్రశిల కనుక ఈ మార్పులు కలుగుతున్నాయని అంటుంటారు. ఈ మర్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఆలయం ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతి స్థంభముపై ఒక నందీశ్వరుని విగ్రహము ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే శివాలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతి గట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయము రెండు అంతస్తులుగా ఉంటుంది. అదిదేవుడు సోమేశ్వరుడు క్రింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైబాగాన రెండవ అంతస్తులో వేరే గర్భాలయంలో అన్నపూర్ణాదేవి ఉంటుంది.
[మార్చు] మండలంలోని పట్టణాలు
- భీమవరం
[మార్చు] గ్రామాలు
- అన్నవరం (భీమవరం)
- బేతపూడి
- చినమిరం
- దిరుసుమర్రు
- కొమరాడ
- కొవ్వాడ
- లొసరిగుట్లపాడు
- నరసింహాపురం
- రామాయనపురం
- రాయలం
- తాడేరు
- తుండుర్రు
- వెంప
- యనమదుర్రు
- గొల్లవానితిప్ప
[మార్చు] జనాభా
వూరు | నివాసాలు | జనాభా | పురుషులు | స్త్రీలు |
భీమవరం మండలం | 52105 | 219212 | 110880 | 108332 |
భీమవరం గ్రామీణ | 19420 | 77148 | 38951 | 38197 |
భీమవరం పట్టణ | 32685 | 142064 | 71929 | 70135 |
అన్నవరం | 359 | 1474 | 669 | 805 |
నరసింహాపురం | 525 | 2122 | 1118 | 1004 |
కొవ్వాడ | 612 | 2283 | 1120 | 1163 |
చినమిరం | 1048 | 4182 | 2071 | 2111 |
రాయలం | 1006 | 3990 | 2045 | 1945 |
తాడేరు | 974 | 3645 | 1842 | 1803 |
యెనమదురు | 852 | 3811 | 1912 | 1899 |
కొమరాడ | 545 | 2117 | 1092 | 1025 |
ఆనకోడేరు | 1539 | 5754 | 2947 | 2807 |
లోసరిగుట్లపాలెం | 5569 | 22680 | 11447 | 11233 |
దిరుసుమర్రు | 2146 | 8917 | 4483 | 4434 |
బేతపూడి | 946 | 3550 | 1813 | 1737 |
తుండుర్రు | 1456 | 5562 | 2800 | 2762 |
వెంప | 1843 | 7061 | 3592 | 3469 |
[మార్చు] మూలాలు, వనరులు
[మార్చు] బయటి లింకులు
|
|
---|---|
జీలుగుమిల్లి · బుట్టాయగూడెం · పోలవరం · తాళ్ళపూడి · గోపాలపురం · కొయ్యలగూడెం · జంగారెడ్డిగూడెం · టి.నరసాపురం · చింతలపూడి · లింగపాలెం · కామవరపుకోట · ద్వారకా తిరుమల · నల్లజర్ల · దేవరపల్లి · చాగల్లు · కొవ్వూరు · నిడదవోలు · తాడేపల్లిగూడెం · ఉంగుటూరు · భీమడోలు · పెదవేగి · పెదపాడు · ఏలూరు · దెందులూరు · నిడమర్రు · గణపవరం · పెంటపాడు · తణుకు · ఉండ్రాజవరం · పెరవలి · ఇరగవరం · అత్తిలి · ఉండి · ఆకివీడు · కాళ్ళ · భీమవరం · పాలకోడేరు · వీరవాసరము · పెనుమంట్ర · పెనుగొండ · ఆచంట · పోడూరు · పాలకొల్లు · యలమంచిలి · నరసాపురం · మొగల్తూరు |