See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions

See also ebooksgratis.com: no banners, no cookies, totally FREE.

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
Privacy Policy Cookie Policy Terms and Conditions
వర్గం చర్చ:హిందూ మతము - వికీపీడియా

వర్గం చర్చ:హిందూ మతము

వికీపీడియా నుండి

[మార్చు] మతమా? జీవన విధానమా?

హిందూ మతము అని అనడం ఎంత వరకూ సమంజసం. ఎందుకంటె, నా అభిప్రాయము, ఇది ఒక మతము కాదు. ఒక జీవన విధానము. దీనికి సంభందించిన మన మూల గ్రంధాలలొ ఎక్కడ చూసినా మానవుడు చక్కటి, ఆరోగ్యకరమైన (శారీరిక-మానశిక) జీవితాన్ని ఎలా గడపాలి అన్న వివరణె కనిపిస్తుంది. మనం ఈ కోణంలో విశ్లెషణ జరిపి అందరినీ ఆలోచింపజేయాలి.madhuriprakash 06:02, 24 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007 అసలు ఏదైనా సరే (మతాన్ని) వేరేగా భావించడం కూడా సరి అయిన పధతి కాదు. ఎందుకంటె అవి కూడా జీవన విధానాలే. ఒక వ్యక్తి అనుసరించి, ఆమార్గము ద్వారా లక్ష్యాన్ని సాధించినపుడు, ఆమార్గాన్ని మరికొంతమంది అనుసరించడంలో ఆశ్చర్యమేమంది? అలాగే మిగతా ధర్మాలు కూడా ఏర్పడ్డాయి. వానిని కూడా నిశితంగానూ లోతుగాను పరిశీలిస్తే తెలుస్తుంది. అన్నింటి మూలభావాలు, లక్ష్యాలు ఒక్కటే కాదంటారా?madhuriprakash 07:14, 24 నవంబర్ 2007 (UTC)మాధురీరావు2007

వస్తూనే ఉత్సాహంగా మంచి టాపిక్ ఎత్తుకొన్నారు.అబినందనలు. మీరన్నది కొంత కరెక్టయినా జీవనవిదానం-మతం రెండూ వేర్వేరు కదండీ. జీవనవిదానం అంటే జీవించే పద్దతి. మతము మనిషియొక్క నమ్మకాల,విశ్వాసాల,చరిత్రల కలయిక. రెండిత్లోనూ కొన్ని విషయాల కలయిక ఉండొచ్చు. హిందూ మతమును అదే పేరుతో పిలవగలం గాని మరొక పేరుతో పిలవలేము కదా. హిందూ జీవన విదానం, ఇతర మతాల జీవన విదానాల గురించిన సమాచారం మీకు తెలిసుంటే ఆపేరుతో లేదా మతాలు-జీవన విదానాలు అని మీరే ఒక వ్యాసం మొదలుపెట్టి రాయడం ప్రారంబించండి. అలాగే ఒకసారి హిందూమత ప్రాజెక్టు పేజీని కూడా సందర్శించి మీ అభిప్రాయం తెలియచేయండి..విశ్వనాధ్. 07:43, 24 నవంబర్ 2007 (UTC)

హిందూమతమన్నది ఒక జీవనవిధానమన్నది మన అభిప్రాయం కావచ్చుకాని దాన్ని అందరూ ఒప్పుకోకపోవచ్చు. అన్ని మతాల లక్ష్యం ఒకటే అయిననూ గమ్యాలు మాత్రం వేరువేరు. ఎవరి గమ్యాన్ని వారు అనుసరిస్తున్నారు. మన హిందూ ధర్మం అతి ప్రాచీనమైనది. అప్పుడు ఇతర మతాలు లేవు. కాబట్టి మన ధర్మశాస్త్రాలలో చక్కటి మానవ జీవన విధానం గురించి వివరించారు. ఆ జీవన విధానమే హిందూ మతంగా ఇప్పటికీ కొందరు అనుసరిస్తున్నారు. కాని నేటి భిన్న మతాల ప్రపంచంలో ప్రతి మతానికీ ఒక్కో జీవన విధానముంది. దాని ఫలితమే భూగోళంపై నలుమూలలా మతాగ్ని ప్రజ్వరిల్లుతోంది. స్వామి వివేకానందుడు చెప్పినట్లు మతం మనుషుల మద్య స్నేహాన్ని, సామరస్యాన్ని నిర్మించాలే తప్ప విద్వేషాన్ని, వైషమ్యాల్ని, విషేధాన్ని జ్వలింపజేయరాదు. అంతేకాదు కులమత ప్రసక్తి లేని విశ్వవ్యాప్త సమాజం ఆవిర్భవించాలని అహరహం కలలుగన్నాడు. 1893 లో చికాగో సర్వమత ధర్మ సమ్మేళనంలో మతాలు వేరైనా మన గమ్యం ఒకటే, అన్ని ఆరాధనా విధానాలు ఆ భగవంతుని సేవకే అని విస్పష్టంగా వివరించాడు. అయిననూ ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఎవరి మతాన్ని వారు తమ మతమే గొప్ప, ఇతర మతాలపై మాది పైచేయి కావాలనే విషపు ఆలోచనే నేటి మానవుల మద్య మతకుంపటి కి కారణం. ఈ రంగంలో మానవులను ఆలోచింపజేయడం భావి ప్రపంచానికి ఎంతో అవసరం.C.Chandra Kanth Rao 14:13, 24 నవంబర్ 2007 (UTC)

విశ్వనాధ్ గారూ! చాలా చక్కగా చెప్పారు. కానీ ఒక్కవిషయం ఆలోచించాలి. అదేమిటంటే, మీరన్న ఆ నమ్మకాలూ, విశ్వాసాలూ, చరిత్రా ఎక్కడినుండి వచ్చాయి? ఆ కాలంలో వారి జీవనశైలి నుండే కదా? వారి రోజువారీ జీవనంలో వారు ఎదుర్కొన్న విషయాలనుండే కదా? ఆనాడు ఏర్పడిన నమ్మకాలూ అవీ ఇన్ని వేల సంవత్సరాలుగా ఉన్నప్పుడు అవి అతి బలంగా తయారయాక ఏ విధముగానూ కదలవు. ఈకాలములోనూ కొన్ని కొత్త కొత్త నమ్మకాలు కలుగుతున్నాయి కదా, అవి అలాగే కొన్ని వేల సంవత్సరాలు ఉంటే అవి కూడా అలాగే అవుతాయి కదా. ఇంతకీ నా ఉద్దేశ్యము ఈ నమ్మకాలూ అవీ ఉండకూడదని ఖచ్చితంగా కాదు. నా ఉద్దేశ్యము ఇవన్నీ ఈ రోజులలో ఎవరికీ చెప్పలేకపోతున్నాము. అవన్నీ పాతకాలపు విషయాలు అని తీసిపారేసేవారే ఎక్కువ. పైగా వారికి ఏమైనా చెబితే ఇవన్నీ ఆకాలములో సరిపోయాయి కానీ ఈకాలానికెలాసరిపోతాయి అని వాదిస్తున్నారు. పైగా, అలాఎందుకు చేయాలి అని అడిగితే, మనలో చాలామంది, అది అంతె మన పెద్దల నుండి వస్తోంది కనుక అని చెప్పి తప్పించుకుంటున్నారు. అందుకనే ఈనాటి వారికి ఆనాటి విషయాలమీద నమ్మకం ఉండడంలేదు. ఆకాలపువారు ఎంతో ఆలోచించి ఏకాలానికైనా సరే సరిపోయే రీతిలో ఎన్నో విషయాలు వివరించారు. వానిని ఈకాలం వారు కూడా ఒప్పుకునే విధంగా, శాశ్త్రీయపద్ఢతిలో విశ్లేషించి, వివరిస్తే తప్పక వాని గొప్పతనాన్ని తెలుసుకుంటారు. madhuriprakash 05:09, 26 నవంబర్ 2007 (UTC)మాధురీరావ్2007.

చంద్రకాంత్ రావ్ గారూ మీరు ఒకసారి గమ్యాలు వేరు వేరు అన్నారు. మరల వివేకానందుని గురించన వివరణలో ఆయన, గమ్యం ఒకటే అని చెప్పారు అని అన్నారు. నాకు మీ ఆంతర్యం సరిగా అర్ధం కాలేదు. madhuriprakash 05:09, 26 నవంబర్ 2007 (UTC)మాధురీరావ్2007

గమ్యాలు వేరువేరు కాబట్టే స్వామి వివేకానందుడు మతాల మద్య సంఘటిత జీవనానికై గమ్యాలు ఓకటే అనే ధర్మోపదేశం చేశాడు. మునుపటిది వాస్తమైతే రెండవది నీతి బోధ. C.Chandra Kanth Rao 16:55, 26 నవంబర్ 2007 (UTC)

చర్చ స్థాయి పెరుగుతున్న సమయంలో అంతరాయం కలిగిస్తున్నందుకు మన్నించాలి. ఇక్కడ చర్చ "ఈ వర్గం పేరు ఏమి పెట్టాలి?" లేదా "ఈ వ్యాసంలో ఇది వ్రాయవచ్చా?" వంటి విషయాలకు పరిమితం చేయమని మనవి. --కాసుబాబు 06:12, 5 డిసెంబర్ 2007 (UTC)

సరే,వ్యాసంలొ పొరపాటు దొర్లింది 'సంహిత'అని ఉండాలి కాని సంహితము అని ఉంది సరి చెయండి.వేదపండిత

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -