సైక్లోస్టైల్
వికీపీడియా నుండి
సైక్లోస్టైల్ ఒకరకమైన ప్రింటింగ్ యంత్రం లాంటిది. దీనిని దేవిడ్ జెస్టనర్ 1880కనుగొన్నారు. సైక్లోస్టైల్ చెయ్యడానికి స్టెన్సిల్ పేపరు,సైక్లోస్టైల్ యంత్రం,స్టెన్సిల్ సిర(ఇంక్), ప్రత్యేకమైన సైక్లోస్టైల్ కు అనువైన తెల్ల కాగితాలు అవసరం.
[మార్చు] స్టెన్సిల్ పేపరు
స్టెన్సిల్ కాగితం 3 కాగితాలతో కూర్చి ఉంటుంది. మెదటిది ఉల్లిపొర కాగితం, రెండెవది కార్బన్ పేపర్, మూడవది మాములు కాగితం. స్టెన్సిల్ బోర్డును కార్బన్ కాగితం మీద పెట్టి ఉల్లిపొర కాగితం పై వ్రాయాలి. అప్పుడు స్టెన్సిల్ కాగితం కత్తిరించబడుతుంది.
[మార్చు] సైక్లోస్టైల్ యంత్రం
ఈ యంత్రం మీద స్టెన్సిల్ పేపరు పెట్టి ,స్టెన్సిల్ సిర పోయవలసిన ప్రదేశంలొ సిర పోయాలి,తెల్ల కాగితాలు ఉండవలసిన స్థలంలో ఉంచి యంత్రం చక్రాన్ని త్రిప్పాలి. ఆప్పుడు కావలసినన్ని ప్రతులు తయారు అవుతాయి.