సత్యనారాయణపురం(విజయవాడ)
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] ఎక్కడ ఉన్నది
సత్యనారయణపురం, విజయవాడ నగరంలొని పెద్ద పేటలలొ ఒకటి. ఈ పేటకు పడమరమరన ఎలూరు కాలవ, ఉత్తరాన ముత్యాలంపాడు,విజయవాడ, తూర్పున సత్యనారయణపురం రైల్వే నివాసాలు మరియు దక్షిణాన బావాజీ పేట, గాంధి నగరం ఉన్నాయి. ఇది పూర్తిగా నివాస ప్రధానమయిన పేట. వ్యాపర వ్యవహారములు, దుకాణములు యెక్కువగా నాగెశ్వరరావు పంతులు రొడ్డునందు కలవు.
[మార్చు] ఆలయాలు
ఇక్కడ శివాలయం, రామాలయము ఉన్నవి. ఇందులొ శివాలయము పురాతనమయినది. రామాలయము 1960లలొ కళ్ళెపల్లి కృష్ణంరాజుగారు కట్టించినారు. ఆయనకు ఒక రైసు మిల్లు ఉండెడిది.
[మార్చు] ముఖ్య కూడళ్ళు
శివాజీ కేఫ్ కూడలి, బాబూరావు మేడ కూడలి, కుక్కల మేడ కూడలి, రాజన్ కిళ్ళీ షాపు కూడలి మొదలగునవి. పూర్వపు కెంద్ర మంత్రి, ప్రముఖ ఇంజనీరు శ్రీ కె ఏల్ రావుగారికి ఇక్కడ ఒక చక్కటి భవనము ఉన్నది. ప్రస్తుతము అందులొ టెలిఫొను ఎక్సెంజి ఉన్నది.
[మార్చు] విద్యా సదుపాయములు
ఇక్కడ మునిసిపాలిటీ వారి ఏ.కె.టి.పి.ఉన్నత పాఠశాల (అంధ్రకెసరి టంగుటూరి ప్రకాశం పంతులు హైస్కూలు)ఉన్నది. ఇందులొ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నది. ఈ స్కూలును ఒకప్పుదు టి.వి.ఏస్ చలపతిరావు హైస్కూలు అని పిలిచెడివారట.ఇది కాక, శ్రీ విగ్నాన విహార్ అను స్కూలుకూడా ఉన్నది. ఇవి కాక అనేక చిన్న చితక బళ్ళు, స్కూళ్ళు చాలా ఉన్నాయి.ప్రాధమిక విద్యకొరకు ఇక్కడి పిల్లలు పేట బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు.
[మార్చు] ప్రముఖ స్థళాలు
- బాబురావు మేడ(BABURAO BUILDING)(ఈ పేటలొని మొట్ట మొదటి ఏత్తయిన భవనము.ఇప్పటికి కూడా ఎత్తయిన భవనములలొ ఒకటి, ఏపార్ట్ మెంటు కాని ఏకైక ఎత్తయిన భవనము. --
- కె.ఏల్.రావు మేడ(K L RAO BUILDING)(ప్రముఖ ఇంజనీరు, మాజీ కేంద్ర మంత్రి శ్రీ కె.ఎల్ రావుగారి స్వగృహం --
- కుక్కల మేడ (ఈ భవనపు మొదటి సొంతదారులు చాలా కుక్కలు పెంచెవారట, అందుకని ఆ భవనమునకు ఆ పెరు వచ్చినది)ప్రస్తుతము, ఈ భవనము విశ్వ హిందూ పరిషత్ వారి అధీనములొ ఉన్నది
[మార్చు] సిటీ బస్సులు
3, 20 నంబరు గలిగిన బస్సులు సత్యనారయణపురం నుండి బయలుదేరె విజయవాడలొని వివిధ ప్రాంతములకు వెళ్ళును.
[మార్చు] ఇతర వివరాలు
- ఇక్కడ చాలాకాలమునుండి శివాజీ కెఫ్ అనె పెరుతొ ఒక కాఫీ హొటలు ఉన్నది.ఈ హొటలును 50 సంవత్సరములకు ముందు శ్రీ దమ్మాలపాటి మాధవరావుగారు మొదలు పెట్టినారు. ఆతరువాత అది చాలా చెతులు మారినప్పటికి, అదె పెరుతొ నడచుచున్నది.
- ఇక్కడ ఒక ఉద్యానవనము(పార్క్)ఉన్నది. ఈ ఉద్యానవనము ఈ మద్యనె పునరుధరించినారు
- ఇక్కడ ఒక చక్కటి జిల్లా గ్రంధాలయము ఉన్నది. 1990లలొ ఇక్కడ లైబ్రెరియనుగా పని చెసిన శ్రీ రాజెశ్వర రావుగారు వెశేష కృషి జరిపి, ఈ గ్రంధాలయమునకు చక్కటి భవనము కట్టించినారు.
- ఒక్క సినిమా హాలు కూడా లెని పెటలలొ ఇది ఒకటి.
- ఈ మధ్య వరకు (2004 సంవత్సరము వరకు), సత్యనారాయణపురంమునకు ప్రత్యెక రైలు స్టెషను ఉండెడిది. రాకపొకలకు ఆడ్డముగా ఉండుట వలన (ఆ రైలు మార్గము మీద 5 గెట్లు అవి వెయుటవలన రాకపొకలకు అంతరాయము) ఆ స్టెషనును తీసివెసినారు.