శోభన
వికీపీడియా నుండి
శోభన | |
---|---|
బొమ్మ:Shobhana2.JPG భరతనాట్య ప్రదర్శన ఇస్తున్న శోభన - కుంభమేళ 2007, రెడ్మాండ్, వాషింగ్టన్. |
|
జననం | శోభన చంద్రకుమార్ పిళ్ళై మార్చి 21, 1966 |
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మళయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం మణిచిత్రతాజులో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
1980లలో మనకున్న ప్రతిభావంతులైన కళాకారిణులలో ఈమెను ఒకరిగ చెప్పుకోవచ్చు. అందంలోను నటనలోనె కాక నాట్యంలో కూడా ఆద్భుతంగా రాణిస్తున్న వ్యక్తి ఈమె. నేటి తరానికి చెందిన ఎందరో కళాకారిణులు ఈమె దగ్గర నటనలోను, నాట్యంలోను శిక్షణ తీసుకుంటూన్నరంటే శోభన ప్రతిభను మనం తెలుసుకోవటంలో తప్పులేదనుకుంటాను.
[మార్చు] శోభన నటించిన తెలుగు చిత్రాలు
- విక్రమ్
- మువ్వగోపాలుడు
- అభినందన
- విజృంభణ
- అజేయుడు
- రుద్రవీణ
- నారీ నారీ నడుమ మురారి
- కోకిల
- అల్లుడుగారు
- కీచురాళ్లు
- రౌడీగారి పెళ్లాం
- ఏప్రిల్ 1 విడుదల
- అప్పుల అప్పారావు
- రౌడీ అల్లుడు
- రక్షణ
- హలో డార్లింగ్
- అహంకారి
- నిప్పురవ్వ (ప్రత్యేక నృత్యం)
- సూర్యపుత్రులు
- గేమ్