విశ్వనాథన్ ఆనంద్
వికీపీడియా నుండి
పూర్తి పేరు | విశ్వనాథన్ ఆనంద్ | |
దేశం | భారత్ | |
జననం | డిసెంబర్ 11 1969 (వయసు 38) చెన్నై, తమిళ నాడు |
|
Title | గ్రాండ్‌మాస్టర్ (1988) | |
ప్రపంచ చదరంగం చాంపియన్ | 2000-2002 (FIDE), 2007-present | |
రేటింగు | 2799 (జనవరి 2008 FIDE ర్యాంకింగుల్లో రెండవ స్థానం) |
|
అత్యధిక రేటింగు | 2803 (April 2006) |
ప్రపంచ చెస్ క్రీడలో భారతదేశానికి వన్నెతెచ్చిన క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పిన్న ప్రాయంలోనే చెస్ క్రీడలో నైపుణ్యం సంపాదించాడు. 14 వ ఏటనే సబ్-జూనియర్ జాతీయ చెస్ చాంపియన్ షిప్ సాధించాడు. 1985 లోనే ఇంటర్నేషనల్ మాస్టర్ గా అవతరించాడు. 16 వ ఏటనే 1985 లో జాతీయ చాంపియన్ షిప్ చేజిక్కించుకున్నాడు. 1987 లోనే ప్రపంచ జూనియర్ చెస్ చాంపియన్ షిప్ సాధించి ప్రపంచం దృష్టిని ఆకర్శించాడు. ఆ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఆ సమయంలోనే గ్రాండ్ మాస్టర్ గా అవతరించాడు. ఈ విషయంలో కూడా దేశంలో ప్రప్రథముడు ఇతనే కావడం గమనార్హం.2000 లోనే మొట్టమొదటి సారిగా మనదేశానికి చెస్ ప్రపంచ చాంపియన్ షిప్ ను సాధించి పెట్టిన రికార్డు మరువలేనిది. 2003 లో ప్రాన్స్ లో జర్గిన రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ లో కూడ గెల్చి తన ఘనతను మరించగా ప్రపంచానికి చాటిచెప్పాడు. 2007 సెప్టెంబర్ 30 న ఫైడ్ ప్రపంచ చెస్ కిరీటాన్ని రెండో పర్యాయం చేజిక్కించుకొని తనకు సాటిలేదని నిరూపించాడు. 2007 అక్టోబర్ 1 న అత్యధిక పాయింట్లతో పైడ్ రేటింగ్ సాధిమ్చి ప్రపంచ నెంబర్ వన్ గా నిల్చాడు.
[మార్చు] సాధించిన అవార్డులు
- 1985 లో అర్జున అవార్డు
- 1987 లో పద్మశ్రీ అవార్డు
- 1987 లోనే సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డు
- 1988 లో పద్మశ్రీ అవార్డు లబించింది.
- 1991-92 లో రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఖేల్ రత్న అవార్డు స్వీకరించిన మొట్టమొదటి క్రీడాకారుడు
- 1992 లో కే.కే.బిర్లా అవార్డు పొందినాడు
- 1997, 1998, 2003, 2004 లలో చెస్ ఆస్కార్ అవార్డులు
- 1998 లో స్పోర్ట్స్ స్టార్ ప్రధానం చేసిన మిలీనియం అవార్డు
- 2000 లో పద్మభూషణ్ అవార్డు