విక్రమోర్వశీయము
వికీపీడియా నుండి
విక్రమోర్వశీయము మహాకవి కాళిదాసు విరచిత సంస్కృత నాటకము. ఇది పురూరవుడు అను రాజు మరియు దేవేంద్రుని ఆస్థాన నర్తకి అయిన ఊర్వశిల ప్రణయగాథ. ఈ నాటకములోని నాయకుడు పురూరవుడు అయినప్పటికీ, చక్రవర్తి చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానములోని నవరత్నములలో ఒకడైన కాళిదాసు ఆయనపై గల ప్రేమ మరియు గౌరవ భావముచే ఈ కృతికి ఆ పేరు పెట్టెనని కొందరి భావన.