వరంగల్ కోట
వికీపీడియా నుండి
వరంగల్ ఖిల్లా గా ప్రసిద్ధిచెందిన ఓరుగల్లు కోట చరిత్ర 13వ శతాబ్ధము నుండి ఉన్నది. ఓరుగల్లు కోట వరంగల్లు రైలుస్టేషనుకు 2 కి.మీ. దూరములోనూ, హనుమకొండ నుండి 12 కి.మీ. దూరంలో ఉన్నది. ఇప్పుడు కోట అవశేషాలు మాత్రమే కనిపిస్తాయి. కోట కీర్తి తోరణాలు ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక చిహ్నంగా వాడుకలో ఉన్నాయి.
విషయ సూచిక |
[మార్చు] చరిత్ర
ఓరుగల్లు కోట నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్న కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవులు 1199 వ సంవత్సరంలో ప్రారంభిచగా, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి 1261 వ సంవత్సరంలో పూర్తి చేసారు. చరిత్ర ప్రకారం ఈ కోట కు మూడు ప్రాకారాలు ఉన్నాయి, ఆ ప్రాకారాల అవశేషాలు ఇప్పటికి కూడా చూడవచ్చు. మెదటి ప్రాకరాన్ని ధరణి కోట అని పిలుస్తారు. ఇది 20 అడుగుల ఎత్తు ఉంటుంది. రెండవ ప్రాకారములో ఉన్న రాతికోట గ్రానైటు రాళ్ళతో నిర్మితమైనది. రాతి కోటకు పెద్దపెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి.ఈ ద్వారాల ఎత్తు 30 అడుగులు ఉండి ఏకశిల నిర్మితమైనవి.కోట ద్వారం మీద కీర్తి తోరణాలు ఉన్నాయి(పూర్ణ కుంభం వంటివి). ఇలాంటి నాలుగు ద్వారాలతో ఈ కోట 19 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి శోభిల్లుతూ ఉండేది.
[మార్చు] స్వయంభూదేవి ఆలయం
కోట మధ్యలో స్వయంభూదేవి ఆలయం నిర్మించబడి ఉన్నది.