లినక్సు ఫార్మటు
వికీపీడియా నుండి
లినక్సు ఫార్మటు , ఇది బ్రిటన్ దేశపు మొదటి లినక్సు పత్రిక! అంతే కాకుండా బ్రిటనులో ఇది ప్రస్తుతము అత్యధికంగా అమ్ముడవుతున్న పత్రిక. ఒక్క బ్రిటను మాత్రమే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాలకు దీనిని ఎగుమతి చేస్తున్నారు.
ఈ పత్రికలో కూడా ఇతర కంప్యూటరు పత్రికలలాగానే అన్ని విషయాలూ ఉంటాయి, కానీ ఇవి లినక్సు వినియోగదారులకోసం ప్రత్యేకంగా వ్రాస్తారు. ఇందులో సమీక్షలు, సాంకేతిక విషయాలు, ట్యుటోరియల్లు మొదలగున్నవి ఉంటాయి. ఈ పత్రికలో వ్యాసాలు అన్ని స్థాయిలలోని వినియోగదారుల కోసం వ్రాస్తారు.
ఈ పత్రిక ప్రతి సంవత్సరం పదమూడు పర్యాయములు ప్రచురిస్తారు. పత్రికతో పాటూ ఒక సీడీ లేదా డీవీడీ వస్తుంది. ఈ సీడీలలో ఏదో ఒక పంపిణీ లినక్సు వస్తుంది.
ఈ పత్రిక ఫ్యూచర్ పబ్లిషింగు వారు ప్రచురిస్తున్నారు. ఇది 1999 లో ప్రారంభమయిన ఈ పత్రికను ఇటాలియన్, గ్రీకు, రష్యన్ భాషలలోకి తర్జుమా కూడా చేస్తున్నారు.