రామసేతు
వికీపీడియా నుండి
భారత్-శ్రీలంక దేశాల మధ్య రామేశ్వరం శ్రీలంక దీవులును కలుపుతు ప్రకృతి సిద్ధమైన సేతువు లాంటి సున్నపు రాతి నిర్మాణం. దీనిని 'ఆడమ్స్ బ్రిడ్జ్' అని కూడ అంటారు.
[మార్చు] రామాయణం
సీతను రావణుడు అపహరించిన తర్వాత వానరసేన సహాయంతో సీతాన్వేషణ ప్రారంభించాడు రాముడు. లంకానగరంలో సీత రావణుడి చెరలో ఉన్నదని హనుమంతుడి ద్వారా తెలుసుకున్న రాముడు రావణుడిపై యుద్ధాన్ని ప్రకటించాడు. అందుకు సమస్త వానర సేనావాహినిని లంకకు తరలించడానికై సముద్రం అడ్డుగా ఉండటంతో వారధి నిర్మించాలని నిర్ణయించాడు రాముడు. ఆ విధంగా వానరులసహాయంతో లంకకు వారధి నిర్మించడం, రావణుని సంహరించడం జరిగింది. రామునిచే నిర్మించబడిన వారధి కాబట్టి దీనిని రామసేతు అంటారు.