రాంలాల్
వికీపీడియా నుండి
ఠాకూర్ రాంలాల్, కాంగ్రేసు పార్టీ నేత, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి[1]మరియు ఆంధ్ర ప్రదేశ్ గవర్నరు.
రాంలాల్ 1929, జనవరి 15న జుబ్బల్ లోని భర్తాట గ్రామములో జన్మించాడు. ఈయన విధ్యాభ్యాసము షిమ్లా మరియు అమృత్సర్ లలో జరిగింది. లా డిగ్రీ కలిగిన ఈయన రాజకీయాలలో చేరక మునుపు కొంతకాలము న్యాయవాద వృత్తిలో కొనసాగాడు. ప్రజాదరణ ఉన్న నాయుకునిగా, ఠాకూర్ రాంలాల్ 1957లో తొలిసారిగా రాష్ట్ర శాసనసభలో స్వతంత్ర అభ్యర్ధి అడుగిడినప్పటి నుండి 1998 ఎన్నికలవరకు పోటీ చేసిన అన్ని శాసనసభా ఎన్నికలలో గెలుపొందిన అరుదైన ఘనత సాధించాడు. ప్రజలతో సన్నిహిత సంబంధాలేర్పరచుకొని జుబ్బల్ మరియు కోట్ఖాయి నియోజకవర్గాలను తనకు పెట్టనికోటలా మలచుకొన్నాడు. ఇక్కడి నుండే ఈయన 9 పర్యాయాలు ఎన్నికైనాడు. 1990 లో జనతాదళ్ అభ్యర్ధిగా పోటీచేస్తూ పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ ను కూడా ఎన్నికలలో ఓడించాడు.
[మార్చు] మూలాలు
- ↑ జనవరి 25, 1971 కి మునుపు హిమాచల్ ప్రదేశ్ కి ముఖ్యమంత్రులు ఉన్నా అప్పుడది కేంద్రపాలిత ప్రాంతముగానే ఉన్నది.