రంగనాయకమ్మ
వికీపీడియా నుండి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. |
రంగనాయకమ్మ సుప్రసిద్ధ మార్కిస్టు,స్త్రీవాద, హేతువాద రచయిత్రి. ఈమె రచనల్లో రామాయణాన్ని మార్క్సిస్టు దృక్పధంతో విమర్శిస్తూ రాసిన రామాయణ విషవృక్షం ఒకటి. స్త్రీవాద రచయిత కావడం వల్ల 'పురుష వ్యతిరేకి'గానూ, రామాయణ విషవృక్షం రాయడం వల్ల 'బ్రాహ్మణ వ్యతిరేకి' గానూ ఈమెకి పేరు.
ఆమె ఆవేశం, ఆమె భావాల్లోని స్పష్టత పాఠకులను ఆశ్చర్యపరుస్తాయి. అద్భుతమైన భావ వ్యక్తీకరణతో, అంతర్లీనంగా వినిపించే ఆవేశంతో, కడుపుబ్బ నవ్వించే హాస్య చతురతతో ఆమె వ్రాసిన నవల స్వీట్ హోం.
విషయ సూచిక |
[మార్చు] జీవితం
రంగనాయకమ్మ, పశ్చిమ గోదావరి జిల్లా బొమ్మిడి గ్రామములో 1939 లో జన్మించారు. ఈమె తాడేపల్లిగూడెం లో ఉన్నత పాఠశాలలో చదివి 1955 లో ఎస్.ఎస్.ఎల్.సీ ఉత్తీర్ణురాలయ్యారు. ఈమె తల్లితండ్రులు ఉన్నత చదువులకొరకు దూరప్రాంతములోని కళాశాలకు పంపించి చదివించలేని కారణముగా ఈమె విధ్యాభ్యాసము అంతటితో ఆగిపోయినది.
రంగనాయకమ్మ 1958లో సాంప్రదాయకముగా పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకొన్నారు. కానీ విరుద్ధ భావాలతో కొనసాగలేక 1970 లో ఆ వివాహము నుండి బయటపడ్డారు. అప్పటి నుండి తన కంటే వయసులో పది సంవత్సరాలు చిన్నవాడు, తన అభిమాని, పాఠకుడు అయిన బీ.ఆర్.బాపూజీ (అలియాస్ గాంధీ) తో కలసి నివసిస్తున్నారు.
[మార్చు] పేరు
తన మొదటి రచనల్లో తండ్రి ఇంటి పేరుతో 'దద్దనాల' రంగనాయకమ్మగా పాఠకులకి పరిచయం. 1958 నుంచి 1970 మధ్య కాలంలో 'ముప్పాళ' రంగనాయకమ్మగా పరిచయం. మొదటి వివాహం నుంచీ బయటపడిన తరవాత తన పేరు నుంచీ 'ముప్పాళ' తీసేసి కేవలం 'రంగనాయకమ్మ'గా పరిచయం.
[మార్చు] రచయిత్రిగా
వైవిధ్యంగల తెలుగు రచయిత్రులలో రంగనాయకమ్మ అగ్రగణ్యులు. తెలుగు భాష నుంచి మార్క్సిజం దాకా, సినిమా విమర్శల నుంచి నవలల దాకా రచల్లో బహుముఖ ప్రజ్ఞ ఆమె సొంతం.
[మార్చు] వివాదాలు
ఈమె వ్రాసిన నవల 'జానకి విముక్తి' ఆంధ్రప్రభ వారపత్రికలో సీరియల్ గా వస్తూ ఉన్న రోజుల్లోనే వివాదాస్పదం కావడం వల్ల మధ్యలోనే ఆగి పోయింది. ఆధునిక తెలుగు సాహిత్యం లో తీవ్ర సంచలనం కలిగించిన యండమూరి వీరేంద్రనాథ్ నవల 'తులసీదళం' ని విమర్శిస్తూ 'తులసిదళం కాదు గంజాయి దమ్ము' అనే వ్యాస సంకలనం వ్రాసారు. వాటిలో యండమూరి తో బాటు ఆ నవలకు ముందుమాట వ్రాసిన డాక్టర్ కొమ్మూరి వేణుగోపాలరావు ను కూడా విమర్శించడం వల్ల అతను పరువు నష్టం దావా వేసి గెలిచాడు.
[మార్చు] నవలలు
- జానకి విముక్తి
- రచయత్రి
- బలిపీఠం
- క్రిష్ణవేణి
- పేకమేడలు
- కూలినగోడలు
- స్త్రీ
- ఇదే నా న్యాయం
- చదువుకున్న కమల
- కల ఎందుకు
- స్వీట్ హోం
- అంధకారంలొ
[మార్చు] ఇతర రచనలు
- రామాయణ విషవృక్షం
- http://www.avkf.org/BookLink/book_link_index.php వారి సౌజన్యంతో
[మార్చు] బయటి లింకులు
- రంగనాయకమ్మ వెబ్ సైటు
- తెలుగుపీపుల్.కాంలో రంగనాయకమ్మ పరిచయం
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రంగనాయకమ్మ పేజీ