మక్తమాదారం
వికీపీడియా నుండి
మక్తమాదారం, మహబూబ్ నగర్ జిల్లా, తలకొండపల్లి మండలానికి చెందిన గ్రామము .
[మార్చు] శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము
మఖ్తా మాధవరంలో కల శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయము సుమారు 400 సంవత్సరముల క్రితము అక్కన్న, మాదన్నల కాలంలో వారి మంత్రి వర్గంలోని గొబ్బూరు శ్రీ వేంకట పతి, నర్స పతి రాజుల స్వప్నంలో స్వామి దర్శనమిచ్చి, ఢిల్లీ సుల్తాను కొలువులో వున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాల స్వామిని ఈ స్థలమందు దేవాలయము నిర్మించి ప్రతిష్ట కావించమని ఆదేశించినారట. స్వామి వారి ఆదేశానుసారము ఈ స్థలమందు ఆలయము నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసినారని పురాణము.
సుమారు 100 సంవత్సరములకు పూర్వము స్వామి వారి నిత్య పూజా విధానానికి లోటు జరగగా, ఉభయ వేదాంత ప్రవర్తకులైనటువంటి శ్రీమాన్ తిరుమల వింజమూరి నర్సింహాచార్యుల వారిచే పున:ప్రతిష్టించబడి అర్చన మరియు ఉత్సవ కైంకర్యములు పాంచరాత్ర ఆగమ ప్రకారముగా ఈ రోజు వరకు వారి వంశస్థులు శ్రీమాన్ తిరుమల వింజమూరి రామానుజా చార్యులు వారిచే నిర్వహించ బడుచున్నది.
శ్రీ సుదర్శన స్వామి వారు అర్చకులయిన శ్రీమాన్ తిరుమల వింజమూరి రామానుజాచార్యుల వారికి స్వప్నములో ఒక యంత్రముగా దర్శనమిచ్చి ఒక భక్తుడైనటువంటి శ్రీ గొబ్బూరు నరసింహా రావు గారి ద్వారా ఆ యంత్రమును అర్చకుల ద్వారా మక్తా మాధవరంలో స్థాపించమని, యాదగిరి క్షేత్రాచార్యుడైనటువంటి శ్రీమాన్ గోవర్ధనం నర్సింహా చార్యుల వద్ద మంత్ర ఉపదేశం గావించి, ఇట్టి క్షేత్రంలో 108 సుదర్శన హోమాలు నిర్విఘ్నముగా నిర్వహించమని ఆదేశించగా, అదే ప్రకారముగా ఈ క్షేత్రములో 108 సుదర్శన హోమాలు అత్యంత వైభవముగా జరిపి, శ్రీ శ్రీ శ్రీ జగద్గురువులైన తోతాద్రి కలియన్ వానమామలై రామానుజ జీయర్ స్వామి వారి కరకమలములచే తేది:9-6-2005 రోజున శ్రీ సుధర్శన నారసింహ మరియు శ్రీ భగవాన్ ధన్వంతరిల మూల విగ్రహ ప్రతిష్ట కావించినారు.
భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ద పాడ్యమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు కడు వైభవంగా జరుపుతారు.
|
|
---|---|
సేరిరామకృష్ణాపూర్ · లింగారపల్లి · పడకల్ · మక్తమాదారం · రావిచేడు · తక్రాజ్గూడ · న్యామతపూర్ · నాగిరెడ్డిగూడ · వంపుగూడ · చెల్లంపల్లి · సాలార్పూర్ · చీపునూతల · యడవల్లి · చనారం · చుక్కాపూర్ · తలకొండపల్లి · బద్నాపూర్ · చంద్రదాన · జూలపల్లి · అంతారం · వెంకటాపూర్పట్టి వెల్జాల · వెల్జాల · మెదక్పల్లి · రాంపూర్ · ఖానాపూర్ (తలకొండపల్లి) · గర్విపల్లి · వెంకటరావుపేట · గట్టు ఇప్పలపల్లి |