మంచు పల్లకి
వికీపీడియా నుండి
మంచు పల్లకి (1982) | |
దర్శకత్వం | వంశీ |
---|---|
తారాగణం | సుహాసిని , చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | అనీల్ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
చిరంజీవితో యండమూరి వీరేంద్రనాథ్ రచయితగా మొట్టమొదటి సినిమా. సినిమా కథ నలుగురు మిత్రుల (చిరంజీవి, నారాయణ రావు, రాజేంద్ర ప్రసాద్, )చుట్టూ తిరుగుంది. ఈ నలుగురూ నిరుద్యోగులు. వీరు ఉంటున్న వీధిలోకి కొత్తగా వస్తుంది సుహాసిని. ఆమె మంచితనాన్ని చూసి చిరంజీవి ఆమెను ఆరాధించడం మొదలు పెడతాడు. సుహాసిని ఈ నలుగురి మిత్రులను విజయం సాధించేలా ప్రోత్సహిస్తుంది. సుహాసినిని వివాహం చేసుకోవాలనుకొన్న చిరంజీవి ఆమెకు క్యాన్సర్ అనీ, ఎంతోకాలం బతకదనీ తెలుసుకొంటాడు. ఒక వైపు వరకట్నం సమస్యతో నారాయణ రావు చెల్లెలు పెళ్ళి చెడిపోతుంది. చివరకు సుహాసిని కోరిక మేరకు చిరంజీవి మిత్రుడి చెల్లెల్ని వివాహం చేసుకోవడంతో కథ ముగుస్తుంది.