Web - Amazon

We provide Linux to the World

ON AMAZON:


We support WINRAR [What is this] - [Download .exe file(s) for Windows]

CLASSICISTRANIERI HOME PAGE - YOUTUBE CHANNEL
SITEMAP
Audiobooks by Valerio Di Stefano: Single Download - Complete Download [TAR] [WIM] [ZIP] [RAR] - Alphabetical Download  [TAR] [WIM] [ZIP] [RAR] - Download Instructions

Make a donation: IBAN: IT36M0708677020000000008016 - BIC/SWIFT:  ICRAITRRU60 - VALERIO DI STEFANO or
Privacy Policy Cookie Policy Terms and Conditions
బెనజీర్ భుట్టో - వికీపీడియా

బెనజీర్ భుట్టో

వికీపీడియా నుండి

బెనజీర్ భుట్టో
بینظیر بھٹو
బెనజీర్ భుట్టో

16వ పాకిస్తాన్ ప్రధానమంత్రి
In office
19 అక్టోబర్ 1993 – 5 నవంబర్ 1996
President వసీం సజ్జద్
ఫారూఖ్ లెఘారీ
Preceded by మోయిన్ ఖురేషీ
Succeeded by మిరాజ్ ఖాలిద్

12వ పాకిస్తాన్ ప్రధానమంత్రి
In office
2 డిసెంబర్ 1988 – 6 ఆగష్టు 1990
President గులాం ఇషాక్ ఖాన్
Preceded by మహమ్మద్ ఖాన్ జునేజో
Succeeded by గులాం ముస్తఫా జతోయ్

జననం జూన్ 21 1953(1953-06-21)
కరాచీ, పాకిస్తాన్
మరణం 27 డిసెంబర్ 2007 (వయసు: 54)
రావల్పిండీ, పాకిస్తాన్
జాతీయత పాకిస్తానీ
రాజకీయ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ
భార్య/భర్త ఆసిఫ్ అలీ జర్దారీ
Alma mater లేడీ మార్గరెట్ హాల్, ఆక్స్‌ఫర్డ్, రాడ్‌క్లిఫ్ కళాశాల
మతం షియా ఇస్లాం

బెనజీర్ భుట్టో (Benazir Bhutto ) (21 జూన్, 195327 డిసెంబర్, 2007) పాకిస్తానీ రాజకీయ నాయకురాలు. ఈమె పాకిస్తాన్‌కు 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసింది. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన తొలి మహిళ బెనజీర్. ముస్లిందేశాలలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ కూడా బెనజీరే. 1953, జూన్ 21న పాకిస్తాన్లోని కరాచీలో జన్మించింది. ఈమె తండ్రి జుల్ఫీకర్ అలీ భుట్టో కూడా పాకిస్తాన్‌కు ప్రధానమంత్రిగా పనిచేసినాడు.

పాకిస్తాన్ ప్రధానిగా తొలిసారి భుట్టో 1988లో పదవి చేపట్టింది. కానీ 20 నెలల తర్వాత, అవినీతి ఆరోపణల కారణంగా అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడు గులాం ఇషాక్ ఖాన్ ఉత్తర్వుల ప్రకారం అధికారం నుండి తొలగించబడింది. 1993లో భుట్టో ప్రధాని పదవికి తిరిగి ఎన్నికైనది. 1996లో తిరిగి అటువంటి ఆరోపణలపైనే అప్పటి అధ్యక్షుడు ఫారూఖ్ లెఘారీ ఈమెను పదవినుండి తొలగించాడు. రాజకీయ కారణాల వల్ల 1999లో బెనజీర్ పాకిస్తాన్ వదలి దుబాయికి ప్రవాసమెళ్ళింది. పాకిస్తానీ సైనికాధ్యక్షుడు, పర్వేజ్ ముషారఫ్తో కుదిరిన ఒప్పందము వలన ఆమెకు క్షమాభిక్ష కలిగించి ఆమెపై ఉన్న అవినీతి ఆరోపణలన్నీ విరమించుకొన్నతర్వాత [1] మళ్ళీ 8 సంవత్సరాల అనంతరం అక్టోబర్ 18, 2007న తిరిగి పాకిస్తాన్ చేరుకుంది.

భుట్టో మాజీ పాకిస్తానీ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో తొలి సంతానము. వీరు పాకిస్తానీ సింధీ తెగకు చెందినవారు. ఈమె తల్లి నుస్రత్ భుట్టో ఇరానీ-కుర్దిష్ సంతతికి చెందిన పాకిస్తానీ. ఈమె పితామహుడు షానవాజ్ భుట్టో భారత విభజన సమయంలో ప్రస్తుతం భారతదేశములోని హర్యానా రాష్ట్రములో ఉన్న తమ స్వగ్రామము భట్టో కలాన్ నుండి సింధ్ లోని లార్కానాకు వలస వచ్చాడు.

ఆక్స్‌ఫర్డ్, హార్వార్డ్ విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్య అభ్యసించిన బెనజీర్ 1977లో పాకిస్తాన్‌లో జరిగిన సైనిక కుట్ర వల్ల చదువులను ఆపివేసి స్వదేశం పయనమైంది. తండ్రి జుల్ఫీకర్ భుట్టోను 1975లో పదవి నుంచి దించివేయడం, ఆ తర్వాత 1977లో ఉరితీయడంతో ఆమె రాజకీయాలలో ప్రవేశించవలసి వచ్చింది. జియా ఉల్ హక్ విమాన ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఎన్నికలలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధినేతగా ఎన్నికలలో విజయం సాధించి 1988లో మొదటిసారి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. కానీ 1990లో అవినీతి ఆరోపణలతో పదవి నుంచి తొలిగించబడింది. 1993లో తిరిగి ఆమె ప్రధానమంత్రి అయింది. ఈ సారికూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయింది. 1996లో మళ్ళీ ఆమె ప్రభుత్వం రద్దయింది. 1996 ఎన్నికకలో నవాజ్ షరీఫ్ ఎన్నిక కావడం, అతన్ని కూలదోసి ముషారఫ్ పదవి చేపట్టడంతో మారిన రాజకీయ పరిణామాల వల్ల బెనజీర్ స్వదేశం నుండి వెళ్ళిపోవలసివచ్చింది. దుబాయి, లండన్‌లలో ఎనిమిదేళ్ళ ప్రవాస జీవితం గడిపిన అనంతరం 2007, అక్టోబర్ 18న మళ్ళీ స్వదేశం చేరుకుంది. స్వదేశం చేరిన వెంటనే కరాచీలో జర్గిన ఉత్సవ వేడుకలలో జరిగిన బాంబుపేలుళ్ళలో తృటిలో ప్రాణాపాయం తప్పింది. నవంబర్ 3న పాకిస్తాన్‌లో అత్యవసర పరిస్థితి విధించడం జరిగింది. ఆ తర్వాత నవంబర్ 8న బెనజీర్ ను గృహనిర్భంధంలో ఉంచినారు. నవంబర్ 24నాడు జర్గబోయే ఎన్నికలకై నామినేషన్ పత్రం కూడా దాఖలుచేసింది. నవంబర్ 27నాడు రావల్పిండిలో ఎన్నికల సభలో పాల్గొన్న అనంతరం ఏకే47తో ఆమె మెడపై బుల్లెట్ల వర్షం మరియు ఆత్మాహుతి బాంబు దాడిలో తీవ్రంగా గాయపడి రావల్పిండి ఆసుపత్రిలో చేర్చిన తర్వాత మరణించింది [2].

[మార్చు] విద్యాభ్యాసం మరియు వ్యక్తిగత జీవితం

బెనజీర్ భుట్టో పాకిస్తాన్లోని కరాచీలో 21 జూన్, 1953న జన్మించింది. కరాచీలో ఈమె చదువు లేడీ జెన్నింగ్స్ నర్సరీ పాఠశాలలోనూ, ఆ తర్వాత కాన్వెంట్ ఆఫ్ జీసస్ అండ్ మేరీలోనూ సాగింది.[3] రావల్పిండీ ప్రెజెంటేషన్ కాన్వెంటులో రెండేళ్ళపాటు చదివిన తర్వాత, ఈమెను ముర్రీలోని జీసస్ అండ్ మేరీ కాన్వెంటులో చేర్చారు. 15 యేళ్ళ వయసులో బెనజీర్ O-లెవెల్ పరీక్షలో ఉత్తీర్ణురాలయ్యింది.[4] ఆ తరువాత కరాచీ గ్రామర్ స్కూలులో ఏ-లెవెల్ పూర్తిచేసింది.

పాకిస్తాన్లో ప్రాధమిక విద్య పూర్తిచేసుకొన్న తర్వాత, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళింది. 1969 నుండి 1973 వరకు రాడ్‌క్లిఫ్ కళాశాలలోనూ, ఆ తర్వాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోనూ చదివి తులనాత్మక పాలనలో బాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టాను పొందింది.[5] ఇక్కడ ఉన్న కాలంలో ఈమె ప్రతిష్టాత్మక ఫీ బీటా కప్పా సంఘానికి ఎన్నికైనది.[4]

ఈమె విద్యాభ్యాసములోని తర్వాత అంకము యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగినది. 1973 నుండి 1977 వరకు భుట్టో తత్త్వశాస్త్రము, రాజనీతిశాస్త్రము మరియు ఆర్ధికశాస్త్రాలను ఆక్స్‌ఫర్డ్‌లోని లేడీ మార్గరెట్ హాల్‌లో చదివింది. ఆక్స్‌ఫర్డ్‌లో ఉండగానే అంతర్జాతీయ న్యాయశాస్త్రము మరియు దౌత్య విద్యలో కోర్సు పూర్తిచేసినది.[6] 1976 డిసెంబరులో ఆక్స్‌ఫర్డ్ యూనియన్ యొక్క అధ్యక్షురాలిగా ఎన్నికై, ఈ ప్రతిష్టాత్మక వాదనా సంఘానికి అధ్యక్షత వహించిన తొలి ఆసియా మహిళగా నిలచినది.[4]

1987, డిసెంబర్ 18న ఆసిఫ్ అలీ జర్దారీని కరాచీలో వివాహం చేసుకున్నది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు: బిలావల్, భక్తావర్ మరియు అసీఫా.

[మార్చు] మూలాలు

[మార్చు] బయటి లింకులు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
Static Wikipedia 2008 (March - no images)

aa - ab - als - am - an - ang - ar - arc - as - bar - bat_smg - bi - bug - bxr - cho - co - cr - csb - cv - cy - eo - es - et - eu - fa - ff - fi - fiu_vro - fj - fo - frp - fur - fy - ga - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - jbo - jv - ka - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mg - mh - mi - mk - ml - mn - mo - mr - ms - mt - mus - my - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nn - -

Static Wikipedia 2007 (no images)

aa - ab - af - ak - als - am - an - ang - ar - arc - as - ast - av - ay - az - ba - bar - bat_smg - bcl - be - be_x_old - bg - bh - bi - bm - bn - bo - bpy - br - bs - bug - bxr - ca - cbk_zam - cdo - ce - ceb - ch - cho - chr - chy - co - cr - crh - cs - csb - cu - cv - cy - da - de - diq - dsb - dv - dz - ee - el - eml - en - eo - es - et - eu - ext - fa - ff - fi - fiu_vro - fj - fo - fr - frp - fur - fy - ga - gan - gd - gl - glk - gn - got - gu - gv - ha - hak - haw - he - hi - hif - ho - hr - hsb - ht - hu - hy - hz - ia - id - ie - ig - ii - ik - ilo - io - is - it - iu - ja - jbo - jv - ka - kaa - kab - kg - ki - kj - kk - kl - km - kn - ko - kr - ks - ksh - ku - kv - kw - ky - la - lad - lb - lbe - lg - li - lij - lmo - ln - lo - lt - lv - map_bms - mdf - mg - mh - mi - mk - ml - mn - mo - mr - mt - mus - my - myv - mzn - na - nah - nap - nds - nds_nl - ne - new - ng - nl - nn - no - nov - nrm - nv - ny - oc - om - or - os - pa - pag - pam - pap - pdc - pi - pih - pl - pms - ps - pt - qu - quality - rm - rmy - rn - ro - roa_rup - roa_tara - ru - rw - sa - sah - sc - scn - sco - sd - se - sg - sh - si - simple - sk - sl - sm - sn - so - sr - srn - ss - st - stq - su - sv - sw - szl - ta - te - tet - tg - th - ti - tk - tl - tlh - tn - to - tpi - tr - ts - tt - tum - tw - ty - udm - ug - uk - ur - uz - ve - vec - vi - vls - vo - wa - war - wo - wuu - xal - xh - yi - yo - za - zea - zh - zh_classical - zh_min_nan - zh_yue - zu -
https://www.classicistranieri.it - https://www.ebooksgratis.com - https://www.gutenbergaustralia.com - https://www.englishwikipedia.com - https://www.wikipediazim.com - https://www.wikisourcezim.com - https://www.projectgutenberg.net - https://www.projectgutenberg.es - https://www.radioascolto.com - https://www.debitoformativo.it - https://www.wikipediaforschools.org - https://www.projectgutenbergzim.com